కొత్త స్ట్రెయిన్ భారత్‌లో లేదు.. ఆందోళన వద్దు: కేంద్రం
Send us your feedback to audioarticles@vaarta.com
పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే ఈ కొత్త స్ట్రెయిన్ భారత్‌లో లేదని.. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నీతీ ఆయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ ఈ ప్రకటన చేశారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌కు వీకే పాల్ నేతృత్వం వహిస్తున్నారు. కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తోందని అయితే వ్యాధి తీవ్రతలో మాత్రం ఎలాంటి మార్పూ లేదని కేంద్రం స్పష్టం చేసింది.
కాగా.. కొత్త కరోనా కారణంగా మరణించే అవకాశం పెరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేష్ భూషన్ తెలిపారు. అయితే.. ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ తాము వెయ్యికి పైగా కేసుల్లో కరోనా శాంపిళ్లను పరీక్షించామని అయితే.. కొత్త కరోనా ఆనవాళ్లు కనిపించలేదని ఆయన తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రం ఇప్పటికే అనేక బ్రిటన్‌కు విమాన సర్వీసులను డిసెంబర్ 31 వరకూ నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ నిర్ధారణ అవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అయితే వారిలో కొత్త రకం వైరస్ ఆనవాళ్లు మాత్రం ఇప్పటి వరకూ కనిపించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
బ్రిటన్ నుంచి కొద్ది రోజులుగా వివిధ రాష్ట్రాలకు భారీగా ప్రయాణికులు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా.. నవంబర్ 25 నుంచి 22వ తేదీ వరకూ యూకే నుంచి భారత్‌కు వచ్చిన వారందరి వివరాలను బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ సహాయంతో సేకరిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. వారిలో ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టైతే కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చేపడతామని స్పష్టం చేశారు. యూకే నుంచి వచ్చిన వివరాలను గుర్తించే పనిలో ఇండియాలోని రాష్ట్రాలన్నీ నిమగ్నమయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com