Chandrababu Naidu: చంద్రబాబును ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదు: వైద్యులు

  • IndiaGlitz, [Saturday,October 14 2023]

జైల్లో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. రాజమండ్రి జైలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జైలు అధికారులతో కలిసి వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ ఆయన శరీరంపై దద్దుర్లు ఉన్నాయని.. ప్రస్తుతం 67 కేజీల బరువు ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని ఉన్నతాధికారులకు సూచిస్తామన్నారు. ప్రస్తుతానికి ఆయనను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎవరికైనా డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉందని.. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చామని వెల్లడించారు. ఆయన యాక్టివ్‌గా ఉన్నారని తమతో మామూలుగానే మాట్లాడారని చెప్పారు. జైలుకు రాకముందు ఆయన ఆరోగ్య పరిస్థితి రికార్డ్స్ ఏంటో తమకు తెలియదని వివరించారు.

వైద్యుల నివేదికను కోర్టులో సమర్పిస్తాం..

వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టు దృష్టికి తీసుకువెళతామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ తెలిపారు. చంద్రబాబు హైప్రొఫైల్ ప్రిజనరీ అని ఆయనను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెప్పారు. 24 గంటలు అధికారులు ఆయన ఆరోగ్యం పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో డాక్టర్ల బృందం మాట్లాడారని.. ఆయన వ్యక్తిగత వైద్యులు సూచిస్తే అవసరమైన వైద్య పరీక్షలు చేస్తామన్నారు. ఇంటి వద్ద ఉండే వాతావరణానికి జైలులో వాతావరణం భిన్నంగా ఉంటుందని డీఐజీ వెల్లడించారు.

చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యుల ఆందోళన..

అంతకుముందు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబసభ్యులు నారా లోకేష్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. జైలులో బాబును చూసి భువనేశ్వరి, లోకేష్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే లోకేష్, భువనేశ్వరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎప్పుడు ములాఖత్ అయిన మీడియాతో మాట్లాడే లోకేష్.. ఈసారి మాత్రం మాట్లాడకుండా వెళ్లారు. మానసికంగా చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఉన్నా.. ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

More News

Pravalika: ప్రేమ వ్యవహారం కారణంగానే ప్రవళిక ఆత్మహత్య.. డీసీపీ క్లారిటీ..

తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Chandrababu: చంద్రబాబుతో ముగిసిన లోకేశ్, భువనేశ్వరి ములాఖత్.. బాబు ఆరోగ్యం పట్ల భావోద్వేగం

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబసభ్యులు నారా లోకేష్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు.

KTR: పొన్నాలను కలిసిన మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం..

అనుకున్నట్లే జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

TDP Protest: మెట్రో సాక్షిగా నవ్వులపాలైన టీడీపీ పెయిడ్ ఆర్టిస్టుల నిరసన

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఆ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న నిరసనలు ప్రజలకు

Pravalika Suicide: ప్రవళిక ఆత్మహత్యపై నివేదిక కోరిన గవర్నర్.. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు

గ్రూప-2 పరీక్షలు వాయిదా పడడంతో హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఉరివేసుకుని ప్రవళిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు.