ఈ సంక్రాంతికి లేనట్టే
Send us your feedback to audioarticles@vaarta.com
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఎవడు', 'గోపాల గోపాల'.. ఈ మూడు చిత్రాలకు సంబంధించి రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ మూడు సినిమాలూ మల్టీస్టారర్ సినిమాలు కావడం ఓ కామన్ ఫ్యాక్టర్ అయితే.. ఈ చిత్ర త్రయాలు సంక్రాంతి సందర్భంలోనే వరుస సంవత్సరాలలో విడుదల కావడం అనేది మరో ఫ్యాక్టర్.
2013లో 'సీతమ్మ..', 2014లో 'ఎవడు', 2015లో 'గోపాల గోపాల'.. ఇలా ప్రతి ఏడాది సంక్రాంతికి ఓ మల్టీస్టారర్ సినిమా అన్నట్లుగా సాగిన వైనం.. 2016లో మాత్రం కొనసాగే వాతావరణం కనిపించడం లేదు. 'డిక్టేటర్', 'నాన్నకు ప్రేమతో'.. ఇలా స్టార్ హీరోల మూవీస్ అయితే ముగ్గుల పండక్కి వస్తున్నాయి కానీ.. మల్టీస్టారర్ సినిమా మాత్రం రానున్న సంక్రాంతికి సందడి చేయట్లేదు. ఏదేమైనా.. మూడేళ్ల పాటు సాగిన సంక్రాంతి సంప్రదాయానికి బ్రేక్ పడుతున్నట్టే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com