కబాలి లీక్ - నష్టం ఏమీ ఉండదంటున్న సెన్సార్ చీఫ్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. ఈ చిత్రం ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే...ఉడ్తా పంజాబ్, సుల్తాన్, గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రాల వలే...కబాలి చిత్రం కూడా లీకైనట్టు ప్రచారం జరుగుతుంది. ఇలాంటిది ఏదో జరుగచ్చు అనే కబాలి నిర్మాత కలై ఫులి ఎస్ థాను కోర్టును ఆశ్రయించగా... పైరసీ చేస్తాయని అనుమానం ఉన్న కొన్ని వెబ్ సైట్స్ ను నిలిపివేయమని ఉత్తర్వలు ఇవ్వడం జరిగింది.
అయితే...కబాలి పైరసీ విషయం పై సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లజ్ నిహ్లానీ స్పందిస్తూ...పైరసీ ఆఖరికి రజనీకాంత్ ను కూడా వదల్లేదు. కబాలి సెన్సార్ చెన్నైలో జరిగింది కాబట్టి ముంబాయిలోని మా సెన్సార్ బోర్డ్ తో సంబంధం లేదు. సల్మాన్ సుల్తాన్ కూడా లీకైందని వార్తలు వచ్చాయి. కానీ...కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఇలాంటి సూపర్ స్టార్ సినిమాలు లీకైనా పెద్దగా నష్టం ఉండదు అన్నారు. అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments