అభిమానికి అన్యాయం జరిగితే నో లాజిక్స్ అంటున్న రామ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ హీరో రామ్ నేను...శైలజ సినిమా గురించి ట్విట్టర్ లో...ఒక న్యూస్ ఛానల్ లో తప్ప వరల్డ్ వైడ్ నేను...శైలజ సినిమా చాలా బాగా రన్ అవుతుంది. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్ అని స్పందించిన విషయం తెలిసిందే. అంతే కాదు...నిర్మాతో ప్రొబ్లమ్ ఉంటే తప్పు రివ్యూ, పొలిటీషయన్ తో ప్రొబ్లమ్ ఉంటే తప్పు న్యూస్. స్టాండర్ట్స్ మెయిటైన్ చేయాలి. సమాజానికి తప్పుడు సమాచారం అందించకూడదు అంటూ న్యూస్ ఛానల్ పై ఫైర్ అయ్యాడు ఎనర్జిటిక్ హీరో. ఇది మొన్నటి విషయం.
లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే... ఆ న్యూస్ ఛానల్ నేను...శైలజ రివ్యూ ప్రసారం చేసే టైంలో ఆ ఛానల్ లో పనిచేసే నవీన్ అనే ఉద్యోగి నేను...శైలజ సినిమా బాగుంది. బాగున్నా సినిమాని బాగోలేదని ప్రసారం చేయడం కరెక్ట్ కాదని యాజమాన్యంతో వాదించాడట. నవీన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించారట. ఈ విషయాన్ని తెలుసుకున్న రామ్...నవీన్ నా సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడినందుకు ఉద్యోగం నుంచి తొలగించారు. ఎప్పటి నుంచో నవీన్ నా అభిమాని అని తెలిసింది.
ఈ సందర్భంగా నవీన్ కి సారీ చెబతున్నాను. ఛానల్ నిర్ణయాన్ని గౌరవిస్తాను. కానీ నా ఫ్యాన్స్ విషయానికి వస్తే...మాత్రం లాజిక్స్ చూడను. కొత్త ఉద్యోగం దొరికే వరకు నవీన్ నా ఆఫీస్ కి వచ్చి ప్రతి నెల జీతం తీసుకోవాలి అంటూ ట్వీట్ చేసాడు రామ్. ఏది ఏమైనా అభిమానికి అన్యాయం జరిగితే నో లాజిక్స్ అంటూ రామ్....ప్రతి నెల జీతం ఇవ్వడానికి ముందుకు రావడం నిజంగా అభినందించదగ్గ విషయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com