హీరోయిన్ లేకుండా కార్తి సినిమా.. 

  • IndiaGlitz, [Thursday,December 13 2018]

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో కార్తి త్వ‌ర‌లోనే 'దేవ్' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు త‌న కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్‌. ప్ర‌కాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.

ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను 'న‌గరం' ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ తెర‌కెక్కించ‌బోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌య‌మేంటే ఈ చిత్రంలో హీరోయిన్ ఉండ‌ద‌ట‌. శ్యామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి స‌త్య డిపి కెమెరా వ‌ర్క్‌ని అందిస్తున్నారు. కార్తి, ర‌కుల్ న‌టించిన 'దేవ్‌' సినిమా డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది.

More News

శ్రీదేవి పాత్ర‌ పై షారూక్ స్పంద‌న‌..

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారూక్‌ఖాన్, ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'జీరో'. అనుష్క శ‌ర్మ‌, క‌త్రినా కైఫ్ న‌టించారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది.

మురుగ‌దాస్ అభ్య‌ర్థ‌న‌ పై విచార‌ణ వాయిదా

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉచితంగా ప్ర‌భుత్వం వ‌స్తువుల‌ను ఇవ్వ‌డాన్ని త‌ప్పుగా చూపిస్తూ స‌ర్కార్ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని జి.దేవ‌రాజ్ అనే వ్య‌క్తి కేంద్ర క్రైం బ్రాంచ్‌కి పిర్యాదు చేశాడు.

జ‌య‌ల‌లిత మ‌రో బ‌యోపిక్ వివ‌రాలు...

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి, అన్నా డీఎంకే అధ్య‌క్షురాలు జ‌య‌లలిత జీవిత చ‌రిత్ర సినిమా రూపంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌టి కాదు.. ఏకంగా మూడు సినిమాలు తెర‌కెక్కుతున్నాయి.

సైరాలో విజయ్ సేతుప‌తి పాత్ర ఏంటంటే?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా టైటిల్ పాత్రలో న‌టిస్తున్న ప్రెస్టీజియ‌స్ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. చిరంజీవి 151వ చిత్ర‌మిది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో

'వెంకీమామ‌' లో శ్రియ రావ‌డానికి కార‌ణం...

యంగ్ హీరో వ‌రుణ్ తేజ్‌తో విక్ట‌రీ వెంక‌టేశ్ చేసిన 'ఎఫ్ 2' వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.