మందు తయారీలో హానికర పదార్థాలు లేవు: ఆయూష్ కమిషనర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన ముగిసింది. ఆనందయ్య ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని ఏపీ ఆయూష్ కమిషనర్ రాములు వెల్లడించారు. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య మందును తయారు చేశారు. మందు తయారీలో హానికర పదార్థాలు లేవని రాములు వెల్లడించారు. అయితే ఆనందయ్య మందును నాటుమందుగానే పరిగణిస్తామని రాములు వెల్లడించారు. కళ్లలో వేసే డ్రాప్స్‌లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని స్పష్టం చేశారు.
అయితే ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది విజయవాడ- తిరుపతి ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని రాములు వెల్లడించారు. డాక్టర్ల బృందం పరిశీలన అనంతరం తమ నివేదికను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్(సీసీఆర్ఎఎస్)కు పంపుతుందున్నారు. కాగా.. రోగులలో డ్రాప్స్ వల్ల ఆక్సిజన్ పెరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందన్నారు.
పసరు వైద్యం పొందిన కొందరి ఆరోగ్యం పైనా డాక్టర్ల బృందం పరిశీలన ఉంటుందన్నారు. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ ఆయూష్ కమిషనర్ రాములు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments