హైదరాబాద్‌లో పూర్తి స్థాయి లాక్డౌన్ లేనట్టేనా?
- IndiaGlitz, [Wednesday,July 01 2020]
హైదరాబాద్‌లో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతుండటంతో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించాలని భావించింది. రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి.. ఆపై అవసరమనుకుంటే కేబినెట్‌ను సమావేశపరిచి లాక్డౌన్ విధిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తే పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించే అవకాశం లేదని తెలుస్తోంది. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో మాత్రం స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తే చాలని అధికారులు సూచించినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు కంటైన్మెంట్ జోన్టలో మాత్రమే లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవీ ప్రకారం అత్యవసరమైతే తప్ప రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ ఎవరూ బయటకు రాకూడదు. అలాగే ఈ సమయంలో మెడికల్ షాపులు, ఆసుపత్రులను మాత్రమే తెరచి ఉంచేందుకు అనుమతించారు.