స్వ‌దేశీ చిత్రంగా బ‌న్నీ 'పుష్ప‌'

  • IndiaGlitz, [Monday,May 11 2020]

టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘పుష్ప‌’. తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా చిత్రంగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. ముత్తం శెట్టి మీడియా, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పాన్ ఇండియా చిత్ర‌మంటే విదేశీ సాంకేతిక‌త‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. అయితే ఇది క‌రోనా వైర‌స్ రాక‌ముందు వ‌ర‌కే. ఎందుకంటే క‌రోనా ఎఫెక్ట్ వ‌చ్చిన త‌ర్వాత విదేశాల నుండి టెక్నీషియ‌న్స్ రావ‌డానికి మ‌న‌వాళ్లు విదేశాల‌కు పోవ‌డానికి కానీ ఇబ్బంది క‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో కేవ‌లం స్వదేశీ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హాయంతో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించ‌నున్నారు.

చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంలో రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో బన్నీ డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, ర‌గ్డ్ లుక్‌తో కనపడ్డారు. ఫ‌స్ట్ లుక్ చూసిన వారంద‌రూ బన్నీ లుక్‌ కొత్తగా ఉందని అన్నారు. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్ర‌మిది.