రవితేజ మిస్ కానున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
2001లో వచ్చిన 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' తో రవితేజకి తొలిసారిగా హీరోగా బ్రేక్ దొరికితే.. 2002లో వచ్చిన 'ఇడియట్' అతని కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ తరువాత రవితేజ రేంజ్ ఏమిటో అందరికి తెలిసిందే. ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా నుంచి 4, 5 సినిమాల వరకు చేస్తూ మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
అయితే గతేడాది విడుదలైన 'బెంగాల్ టైగర్' తరువాత మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టని రవితేజ నుంచి ఈ ఏడాదిలో సినిమా వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఆ మధ్య దిల్ రాజు బేనర్లో ఓ సినిమా ప్రారంభమైనా ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. మే నెల గడుస్తున్నా ఇప్పటివరకు రవితేజ కొత్త సినిమా ఏదీ సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో రవితేజ సినిమా ఈ ఏడాదిలో రావడం కష్టమే అనిపిస్తోంది. అదే గనుక జరిగితే కథానాయకుడిగా క్లిక్ అయ్యాక అతని నుంచి సినిమా రాని తొలి సంవత్సరంగా 2016 నిలిచిపోతుంది. ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments