మీ వాహనం మోడల్ అదైతే మాత్రం.. తిరుమలలో నో ఎంట్రీ..
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుమలలో వాహనాల మోడల్‌పై ఆంక్షలు విధించారు. తిరుమలతో పాటు.. ఘాట్ రోడ్లపై కాలం చెల్లిన వాహనాలకు అనుమతి నిరాకరించనున్నారు. తిరుమలలో ప్రమాదాలకు కారణాలను గుర్తించి.. నివారణకు అవసరమైన చర్యలను చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే తిరుమల అడిషనల్ ఎస్పీ ముని రామయ్య నిర్వహించిన మీడియా సమావేశంలో పాత వాహనాలపై నిషేధాన్ని విధిస్తున్నట్టు వెల్లడించారు. పదేళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని మునిరామయ్య స్పష్టం చేశారు. పాతవి, ఫిట్నెస్ లేని వాహనాలపై తిరుమల ఘాట్ రోడ్లలో నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని మునిరామయ్య స్పష్టం చేశారు. ఫిట్నెస్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించబోమని ఆయన వెల్లడించారు.
రెండో ఘాట్ రోడ్డులోని శ్రీవారి సహజ శిలా స్వరూపం కనిపించే ప్రదేశంలో వాహనాలు నిలిపేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆ ప్రదేశంలో భక్తులు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తిరుమల క్షేత్రం నో హారన్ జోన్ కావడంతో భక్తులు తమ వాహనాల హారన్ మోగించకూడదని సూచించారు. వాహనాల హారన్ మోగించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానా విధిస్తామని ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout