Bigg Boss Telugu 7 : ఈ వారం నో ఎలిమినేషన్ .. నెక్ట్స్ వీక్ ఇద్దరు ఇంటికే , మరిన్ని ట్విస్టులు ఖాయం
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు ఉల్టా పల్టా సీజన్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతోంది. మరికొద్దిరోజుల్లో షోకు ఎండ్ కార్డ్ పడనుండటంతో దానిని మరింత ఆసక్తిగా మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి వారం ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసే బిగ్‌బాస్ ఈ వారం మాత్రం నో ఎలిమినేషన్ అన్నాడు. దీనికి బదులుగా వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ వుంటుందని చెప్పాడు. దీనికి హోస్ట్ నాగార్జున రీజన్ వివరించారు.
తాను ఫౌల్ గేమ్ ఆడినట్లుగా నాగార్జున ఆధారాలు చూపించడంతో ప్రిన్స్ యావర్ తను సంపాదించిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ని తిరిగిచ్చేయడంతో ముందు రోజు ఎపిసోడ్ ముగిసింది. ప్రస్తుతం శివాజీ, అర్జున్ అంబటి, అమర్దీప్ చౌదరి, శోభాశెట్టి, ప్రియాంక జైన్, అశ్వినిశ్రీ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, రతిక, గౌతమ్ హౌస్‌లో వున్నారు. మరో నాలుగు వారాలు మాత్రమే షో జరగనుంది. ఈ గ్యాప్‌లోనే టాప్ 5లో ఎవరు వుండబోతున్నారనే విషయంపై క్లారిటీ రానుంది.
ఇది ఆదివారాన్ని సూపర్ సండేగా మార్చడానికి హోస్ట్ నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. రాగానే హౌస్‌లో ఫ్రెండ్‌ని చేసుకునేది ఎవరినీ, బ్లాక్ చేసేది ఎవరినీ అనే పేరుతో ‘‘యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్‌మేట్’’ టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా ఒక్కో కంటెస్టెంట్.. ఇద్దరికీ ఈ రెండు ట్యాగ్స్ ఇవ్వాల్సి వుంటుంది. మరి ఎవరు ఏ ట్యాగ్ ఇచ్చారో చూస్తే : గౌతమ్.. ప్రశాంత్, శోభాశెట్టి, అమర్దీప్.. ప్రశాంత్, రతిక, రతిక.. శోభాశెట్టి, అమర్దీప్, అశ్వినిశ్రీ... శోభాశెట్టి, గౌతమ్, ప్రిన్స్ యావర్.. శోభాశెట్టి, గౌతమ్, ప్రశాంత్.. అమర్దీప్, రతిక, అర్జున్ .. శివాజీ, ప్రిన్స్ యావర్, శివాజీ.. అర్జున్, రతిక, ప్రియాంక.. ప్రశాంత్, అశ్విని శ్రీలను సెలక్ట్ చేసుకున్నారు.
అనంతరం కోటబొమ్మాళి పీఎస్ మూవీ టీమ్ తమ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ స్టేజ్ మీదకు వచ్చారు. ఈ సందర్భంగా శివాజీని .. శ్రీకాంత్ పెద్దాయన అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అంతా తనను పెద్దాయన అనడం నరకంగా వుందని, తలుపులు తీస్తే వెళ్లిపోతానని కోరాడు. తర్వాత నామినేషన్స్‌లో వున్న వారిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు నాగార్జున. చివరికి అశ్వినీ, గౌతమ్‌లు మిగిలిరు. వారి ముందు రెండు బాక్స్‌లు వుంచి.. లోపలికి చేయి పెట్టాలని బయటకు తీసేటప్పుడు ఎవరి చేతికి ఎరుపు రంగు వుంటుందో వారు ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. కానీ ఆశ్చర్యకరంగా ఇద్దరు చేతులకు పచ్చ రంగు వుండటంతో ప్రేక్షకులు, కంటెస్టెంట్స్ షాకయ్యారు. ఈ వారం నో ఎలిమినేషన్ అని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.
ఈ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించలేకపోవడంతో ఎలిమినేషన్ లేదని నాగ్ వెల్లడించారు. గత వారం ఐదుగురు మాత్రమే ఈ పాస్ కోసం పోటీపడగా.. వచ్చే వారం మాత్రం అందరికీ ఛాన్స్ వుంటుందని, దానిని బిగ్‌బాస్ డిసైడ్ చేస్తారని చెప్పాడు. ఈ వారం, వచ్చే వారం కలిపి డబుల్ ఎలిమినేషన్ వుంటుందని నాగార్జున చెప్పడంతో కంటెస్టెంట్స్ షాకయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments