‘సైరా’లో అస్సలు డూప్‌లను పెట్టలేదు: చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రంలో పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని అప్డేట్స్‌ను మెగాభిమానులకు అందజేసింది చిత్రబృందం. అతి త్వరలోనే ‘సైరా’ ఫ్యాన్స్ ముందుకు వచ్చే్స్తున్నాడు. సినిమా రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో దర్శకనిర్మాతలు ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన.. మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తన లైఫ్ హిస్టరీతో పాటు ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలు.. ముఖ్యంగా ‘సైరా’ గురించి పలు ఆసక్తికర విషయాలను చిరు పంచుకున్నారు.
నాకెవ్వరూ డూప్ లేరు!
సైరా’లో సీన్లు గురించి ఇబ్బంది పడ్డారా..? అనే ప్రశ్నకు చిరుకు ఎదురవ్వగా చాలా లాజిక్‌గా మెగాస్టార్ సమాధానమిచ్చారు. ఇందుకు చిరు స్పందిస్తూ.. ‘అబ్బే.. నేను యాక్షన్ సన్నివేశాలు చేసేటప్పుడు అస్సలు నా వయసు గురించి మర్చిపోతానంతే. అసలు ఆ స్టంట్ చేస్తానా? చేయలేనా? అని ఆలోచించే పరిస్థితే ఉండదు. దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లిపోతానంతే. అయితే.. ‘సైరా’లో కనిపించే (ఇప్పటికే రిలీజైన మేకింగ్ వీడియోను ఉద్దేశించి) గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు అన్నీ నేనే సొంతంగా చేశాను. నా స్థానంలో ఎవర్నీ డూప్‌గా పెట్టుకోలేదు. షూటింగ్‌లో భాగంగా భుజానికి గాయమైనా తిరిగి కోలుకున్న తర్వాతే షూటింగ్‌లో పాల్గొన్నాను అంతే తప్ప ఎవర్నీ డూప్‌ను మాత్రం వాడలేదు. అయితే నేనిప్పుడు పెద్ద పెద్ద కత్తులను సులభంగా తిప్పేస్తాను. కత్తులు తిప్పుతున్నప్పుడు ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది’ అని చిరు చెప్పుకొచ్చారు.
చిరు ఇచ్చిన సమాధానానికి కోడలు ఉప్సీ ఒకింత ఆశ్చర్యపోయారు. ఈ ఇంటర్వ్యూ చూసిన మెగాభిమానులు, సినీ ప్రియులు నాటి చిరంజీవిని గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు అభిమానులు అయితే.. ‘అందుకే అయ్యా ఆయన్ను మెగాస్టార్ అనేది’ అని అభిమానులు కితాబిస్తున్నారు. మరి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా జనాలకు ఏ మాత్రం నచ్చుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout