నా తల్లిదండ్రులతో విభేదాలేమీ లేవు: పీవీ సింధు
Send us your feedback to audioarticles@vaarta.com
తాను కొన్ని పనుల మీద కొద్ది రోజుల క్రితం లండన్ వచ్చానని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలిపారు. అయితే తను తన తల్లిదండ్రులతో గొడవ పడి లండన్‌కు వెళ్లినట్టు ఒక స్పోర్ట్స్ రిపోర్టర్ ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తున్నారని.. ఇలాంటి వాటి కారణంగా తన రిప్యుటేషన్ దెబ్బతింటుందని పీవీ సింధు పేర్కొంది. వెంటనే ఇలాంటివి ఆపకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని పీవీ సింధు హెచ్చరించింది. అలాగే తన కోచ్ పుల్లెల గోపిచంద్‌తో విభేదాలు వచ్చాయంటూ వస్తున్న వార్తలను సైతం ఆమె ఖండించింది.
‘‘జీఎస్‌ఎస్‌ఐతో పని ఉండి కొద్ది రోజుల క్రితం లండన్ వచ్చాను. నా తల్లిదండ్రుల అంగీకారంతోనే ఇక్కడకు వచ్చాను తప్ప మామధ్య గొడవలు ఉండి కాదు. నా కోసం తమ జీవితాన్నే త్యాగం చేసిన నా తల్లిదండ్రులతో నాకు సమస్యలు ఎందుకు ఉంటాయి? నాకు నా కుంటుంబంతో చాలా మంచి అనుబంధం ఉంది. అలాగే వారంతా ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలుస్తారు. ప్రతి రోజూ నేను నా ఫ్యామిలీతో టచ్‌లో ఉంటూనే ఉంటాను.
అలాగే అకాడమీలో ట్రైనింగ్ ఫెసిలిటీస్ గురించి కానీ.. నా కోచ్ గోపిచంద్‌తో కానీ నాకు ఎలాంటి విభేదాలూ లేవు. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ రిపోర్టర్ రత్నాకర్ గారు ఫాల్స్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటివి రాసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి. ఆయన ఇకపై అలాంటి రాతలు ఆపకుంటే.. నేను ఆయనపై లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పీవీ సింధు ట్వీట్‌లో పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments