బాలయ్యతో విబేధాల్లేవ్.. నాకు ప్రత్యేక గౌరవం : నాగబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ గత కొన్ని రోజులుగా నటుడు కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా నిలిచిన విషయం విదితమే. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన భేటీ మొదలుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశం వరకూ తనకు ఎలాంటి పిలుపు అందలేదని.. ఎవడూ తనను పిలవలేదని బాలయ్య బూతులు మాట్లాడిన వ్యవహారం అందరికీ తెలిసిందే. తనను ఎవరూ పట్టించుకోలేదని ఆ తర్వాత కూడా పలు ఇంటర్వ్యూల్లో ఆయన మరోసారి చెప్పుకొచ్చారు. ఇప్పటికే రెండు ప్రముఖ చానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ వ్యవహారంపై మరోసారి ఆయన స్పందించారు. అయితే.. మొదట బాలయ్యపై మెగా బ్రదర్ నాగబాబు ఒంటి కాలిపై లేచి వార్నింగ్‌లు ఇస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఇలా ఈ ఇద్దరి కామెంట్స్‌తో నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వారే జరిగింది. తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూ వేదికగా నాగబాబు స్పందించారు.
ఫుల్ స్టాప్ పడింది..!
‘తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ ఇండస్ట్రీ జరిపిన చర్చలకు బాలకృష్ణను పిలకపోవడం తప్పా ? రైటా ? అనేది నాకు తెలియదు. బాలయ్య మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు రియల్ ఎస్టేట్ కోసమే..? కలిసారంటూ చేసిన వ్యాఖ్యలనే నేను ఖండించాను. ఈ విషయంలో బాలకృష్ణ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని.. సినీ పరిశ్రమకు క్షమాపణలు చెప్పాలని మాత్రమే నేను కోరాను. బాలకృష్ణతో నాకెలాంటి విభేదాలు లేవు. ఆయనంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది. నేను బాలకృష్ణను టార్గెట్ చేయలేదు. ఆయన మాట్లాడింది తప్పు అని మాత్రమే చెప్పా. ఆయనతో నాకు వ్యక్తిగత శతృత్వం ఏమి లేదు. బాలకృష్ణ టాలీవుడ్లో పెద్ద హీరో. నేను చిరంజీవి తమ్ముడిని. అదీ కాక ఓ నటుడిని నిర్మాతను కూడా. మా ఇద్దరి మధ్య అసలు పోలికలే లేవు. ఆయనతో నేను ఎపుడు సమానం అని చెప్పుకోను. ఇక బాలకృష్ణతో నాకు వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదు. కలిసినపుడు హాయ్ అంటే హాయ్ అని పిలుచుకుంటాం. ఆయన కూడా తన మాట్లాడిన మాటలో రియలైజ్ అయ్యారు. మా గొడవలు అన్నీ టీ కప్పులో తుఫాను లాంటివి’ అని నాగబాబు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. మొత్తానికి చూస్తే.. ఆలస్యం అయినా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడటంతో అటు నందమూరి ఇటు మెగా ఫ్యాన్స్ కాసింత ఊపిరిపీల్చుకున్నారు. అయితే నాగబాబు సడన్‌గా ఇలా టోన్ మార్చేశాడేంటి..? అని అందరిలోనూ చర్చ మొదలైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout