జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పదవి లేదా!?
Send us your feedback to audioarticles@vaarta.com
వైఎస్ జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పదవి లేదా..? అసలు డిప్యూటీ సీఎం పదవి అనేది వద్దని జగన్ ఫిక్స్ అయ్యారా..? ఒక వేళ జగన్ మనసు మార్చుకుంటే ఆ పదవి ఎవరికిస్తారు..? వైసీపీలో ఈ పదవికి సరిపోయే సీనియర్ వ్యక్తి ఎవరు..? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అయితే డిప్యూటీ సీఎం వ్యవహారంపై వైసీపీ శ్రేణులు ఏమనుకుంటున్నాయ్..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డిప్యూటీ సీఎం ఉందా.. వన్ అండ్ ఓన్లీనా..!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయ కేతనం ఎగరేసిన తర్వాత మే-30న వైఎస్ జగన్ ఒక్కరే సీఎంగా ప్రమాణం చేశారు. అయితే ఇంత వరకూ కేబినెట్ విస్తరణ జరగలేదు. జూన్-08న 25 మందిని తన కెబినెట్‌లోకి తీసుకోనున్నారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలోనే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, వైఎస్ జగన్.. కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయిస్తారు సరే.. డిప్యూటీ సీఎం ఎవరు..? అసలు డిప్యూటీ అనేది జగన్ కెబినెట్లో ఉంటుందా..? ఉండదా అంటే దాదాపు ఉండదనే వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. డిప్యూటీ అనేది లేకుండా వన్ అండ్ ఓన్లీ సీఎం పదవి మాత్రమే ఉంటుందని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
ఉమ్మారెడ్డి పరిస్థితేంటి..!?
ఒక వేళ ఈ రెండ్రోజుల్లో మనసు మార్చుకుంటే మాత్రం వైసీపీలో సీనియర్ నేత, వైసీపీ గెలుపులో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకే ఉప ముఖ్యమంత్రి పదవి దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. కాగా.. ప్రస్తుతం పార్టీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లే సీనియర్.. ఆయనంత అనుభవం.. దాదాపు ఎవరికీ లేదని చెప్పుకోవచ్చు. అంతేకాదు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉమ్మారెడ్డికి ఉంది. ఇవన్నీ అటుంచితే నవరత్నాలు అనే ఐడియా ఉమ్మారెడ్డి మైండ్‌లో నుంచే వచ్చిందని వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు వైసీపీ గెలుపులో కూడా నవరత్నాలే కీలకమవ్వడం.. విశేషమని చెప్పుకోవచ్చు. జగన్ ప్రెస్‌మీట్లు పెట్టిన ప్రతీసారి ఉమ్మారెడ్డి ఆయన పక్కనే ఉంటారు.. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్‌కు రాజకీయ సలహాదారుడిగా ఉన్నారని చెప్పుకోవచ్చు.
కీలకపాత్ర.. కంచుకోట బద్దలు..!
కాగా.. ఉమ్మారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన అల్లుడు కిలారి రోశయ్యకు పొన్నూరు టికెట్ ఇప్పించిన ఉమ్మారెడ్డి.. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టించారు. వైఎస్ హయాం నుంచి పొన్నూరు అంటే టీడీపీ.. టీడీపీ అంటే పొన్నూరుగా పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే కిలారి రోశయ్య రంగంలోకి దిగి పోటీచేశారో.. కంచుకోటను బద్దలు కొట్టారు. సో.. పార్టీని గెలిపించడంలో.. కంచుకోటను బద్దలు కొట్టడంలో కీలక పాత్ర పోషించిన ఉమ్మారెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవిస్తారో.. లేకుంటే ఇంకో పదవి ఏమైనా ఇస్తారో తెలియాలంటే జూన్-08 వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments