Chandrababu Naidu:చంద్రబాబును నమ్మని జనం.. విశాఖ సభకు స్పందన కరువు, ఖాళీ కుర్చీలకు ‘విజన్’ చెప్పారా..?

  • IndiaGlitz, [Wednesday,August 16 2023]

గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి తేరుకునేందుకు టీడీపీ కిందా మీద పడుతున్న సంగతి తెలిసిందే. ఆయన గేట్లు ఎత్తితే తెలుగుదేశంలో వున్న నేతలంతా జంప్ అయ్యేందుకు రెడీగా వున్నారు. కానీ నిజాయితీ, నిబద్ధత కలిగిన జగన్ తనకు అవకాశం వున్నప్పటికీ ఆ పనిచేయలేదు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీని జాకీలు పెట్టి లేపేందుకు చంద్రబాబు నాయుడు తెగ కష్టపడుతున్నారు. కొడుకు చేత పాదయాత్ర చేయిస్తున్న ఆయన.. తను కూడా ప్రాజెక్ట్‌ల సందర్శన పేరుతో పర్యటనలు చేస్తున్నారు. కానీ వీటికి జనం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది.

అంగళ్లు, పుంగనూరులలో చంద్రబాబు కనుసన్నల్లో విధ్వంసం:

ప్రజలను తన వైపుకు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఆయన హింసా రాజకీయాలకు తెరదీశారు. ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులలో జరిగిన విధ్వంసం ఆయన కనుసన్నల్లోనే జరిగింది.తనను అడ్డుకోవడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కేడర్, పోలీసులను వదలొద్దు దాడి చేసి తరిమి కొట్టాలంటూ చంద్రబాబు కార్యకర్తలను రెచ్చగొట్టారు. మీరు కర్రలతో వస్తే నేనూ కర్రలతో వస్తా.. మీరు యుద్ధం ప్రకటిస్తే నేను యుద్ధం ప్రకటిస్తానంటూ పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. డీఎస్పీ స్థాయి అధికారిని ఏయ్ నీ యూనిఫాం తీసేయ్ అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పోలీసులను చితకబాదిన తెలుగు తమ్ముళ్లు :

టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి.. ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ సవాల్ విసిరారు. తాను కూడా చిత్తూరు జిల్లాలోనే పుట్టాలనని.. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను బెదిరించడం, మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు అంటూ హెచ్చరించారు. రౌడీలకు రౌడీగా వుంటా.. ఏయ్ పోలీస్ వాళ్లను పంపించూ అంటూ ఫైర్ అయ్యారు. అందరూ పెయిడ్ ఆర్టిస్టులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుందని, దెబ్బలు తగిలినా, తలలు పగిలినా భయపడేది లేదని, మగాళ్లైతే పోలీసులు లేకుండా రండి తేల్చుకుందాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పైశాచికత్వం కారణంగా ఎందరో పోలీసులు తీవ్రంగా గాయపడగా.. ఓ కానిస్టేబుల్‌కు చూపు పోయింది.

ప్రాజెక్ట్‌ల సందర్శనను పట్టించుకోని జనం :

ప్రాజెక్ట్‌ల సందర్శనకు జనం పెద్దగా రియాక్ట్ కాకపోవడంతో ఆయన కొత్త ఎత్తు వేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్‌లో రెండున్నర కిలోమీటర్ల పాటు ఆయన జాతీయ సమైక్యతా పాదయాత్ర చేశారు. అది ముగిసిన వెంటనే ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశం , రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎలా వుండాలి, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనేదానిపై ప్రజంటేషన్ ఇచ్చారు. డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్ అనే విషయాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

ఎన్నో డ్రోన్లు వాడినా జనం నిల్ :

తన కార్యక్రమం సూపర్‌హిట్ అని చెప్పుకోవడానికి డ్రోన్ షాట్లు, అనుకూల మీడియాలో లైవ్ స్ట్రీమింగ్, సోషల్ మీడియాలోనూ అప్‌డేట్స్ వచ్చేలా చేశారు. కానీ విజన్ డాక్యుమెంట్ సభలో జరిగింది వేరు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో జనం ఎక్కడా కనిపించలేదు. ఎటువైపు చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సభ వెల వెల బోతున్న దృశ్యాలు, అటు చంద్రబాబు ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భవిష్యత్తుపై తెలుగు తమ్ముళ్ల బెంగ :

మరికొద్దినెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అందరూ ఇంటి పట్టున వుండే ఆగస్ట్ 15 నాడే వ్యూహాత్మకంగా చంద్రబాబు సభ నిర్వహించినా దీనికి కనీస స్పందన లేకపోవడం పార్టీ పెద్దలకు అంతు చిక్కడం లేదు. రాజమండ్రిలో జరిగిన మహానాడులో ఐదు అంశాలతో మిని మేనిఫెస్టోను ప్రకటించారు. కనీసం ఇది చూసైనా ఆదరణ దక్కుతుందనుకున్న టీడీపీ నేతలకు ఆ ఛాయలేవి కనిపించకపోవడంతో నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లయ్యింది. నా విజన్ 2047 అని చెబుతున్నా చంద్రబాబును జనం నమ్మకపోవడంతో సమీప భవిష్యత్తులో పరిస్థితి ఎలా వుంటుందోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.