'సర్దార్' కోసం ఏ మాత్రం తగ్గట్లేదు
Send us your feedback to audioarticles@vaarta.com
దేవిశ్రీ ప్రసాద్.. తెలుగు నాట ఇటీవల కాలంలో ఈ సంగీత తరంగం సృష్టించిన సంచలనాన్ని మరెవరూ రిపీట్ చేయలేదు. ప్రతి అగ్ర కథానాయకుడు కానీ.. టాప్ డైరెక్టర్ కానీ మొదట దేవిశ్రీనే అనుకుని.. అది కుదరకపోతే మరో సంగీత దర్శకుడితో సినిమాలు చేసుకుపోతుంటారు. ఎవరో ఒకరిద్దరు విషయంలో మినహాయిస్తే.. టాలీవుడ్‌లో దేవిశ్రీ విషయంలో ఇదే పరిస్థితి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ మధ్య కాలంలో పవన్ హీరోగా దేవిశ్రీ సంగీతమందించిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది.. ఇలా ఓ హ్యాట్రిక్ వీరి పేరు మీద నమోదు అయింది. ఈ నేపథ్యంలో వీరి రెండో హ్యాట్రిక్ శ్రీకారం చుట్టనున్న సర్దార్ గబ్బర్‌సింగ్ కూడా మ్యూజిక్ పరంగా వండర్ క్రియేట్ చేయనుందని ఇన్‌సైడ్ సోర్స్ చెబుతోంది. అందుకే సర్దార్‌కి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చే విషయంలో దేవిశ్రీ ఏ మాత్రం తగ్గట్లేదట. మార్చిలోనో, ఏప్రిల్‌లోనో సర్దార్ పాటలు విడుదలవుతాయ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com