బన్నీ, మహేష్ ల మధ్య పోటీ లేనట్లేనా?

  • IndiaGlitz, [Thursday,November 30 2017]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా 'నా పేరు సూర్య'. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నఈ సినిమా ద్వారా ర‌చ‌యిత వక్కంతం వంశీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 27వ తేదీన థియేటర్లలోకి రానుందని నిర్మాత బన్నీ వాసు తెలియచేసారు.

అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న 'భరత్ అనే నేను' ని కూడా అదే ఏప్రిల్ 27న విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు ఆ చిత్ర నిర్మాతలు. మహేష్ సినిమాని ఏప్రిల్ 27న రిలీజ్ చేయబోతునట్లు ప్రకటించిన వెంటనే.. బన్నీ సినిమా డేట్ మార్చే ప్రసక్తి లేదని, ముందు అనుకునట్లు గానే విడుదల చేస్తామని వాసు చెప్పారు.

ఈ నేపథ్యంలో బన్నీ, మహేష్ బాబు సినిమాల మధ్య పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కాని ఇప్పుడు వాసు మనసు మార్చుకుని, మేలో బన్నీ సినిమా విడుదలకి ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే.. దీని వెనుక ఒక కారణం ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్‌ మూవీ తర్వాత కొరటాల.. రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేసారు.

కాని ఇప్పుడు మధ్యలో రాజమౌళి ఎంటరై ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కొరటాల.. చరణ్ తో చేయాల్సిన సినిమాని బన్నీతో చేయడానికి నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఈ కార‌ణంతోనే.. బన్నీ తను ప్రస్తుతం చేస్తున్న సినిమా విడుదల విషయంలో చిన్న అడ్జ‌స్ట్‌మెంట్ చేసుకున్నట్లు స‌మాచారమ్‌.

More News

`అజ్ఞాతవాసి` ఆడియో ఎప్పుడంటే...

పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అజ్ఞాతవాసి'. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటించారు.

రెహమాన్.. 25 ఏళ్ల తరువాత

‘రోజా’(1992).. భారతీయ చిత్ర పరిశ్రమకి సంబంధించినంతవరకు ఈ సినిమా ఓ సంచలనం. కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాకుండా.. ఓ సంచలన సంగీత దర్శకుడిని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిందీ మణిరత్నం చిత్రం.

రిపబ్లిక్ డే సందర్భంగా 'విశ్వరూపం-2'

లోకనాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వరూపం 2’. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే మళ్లీ ఈ సినిమా షూటింగ్ చెన్నైలో మొదలయ్యింది. ఒకటి, రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోనుందని తెలిసింది.

'ఖడ్గం'కి 15 ఏళ్లు

దేశ భక్తి నేపథ్యంలో రూపొందే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. వాటిలో విజయం సాధించే సినిమాల సంఖ్య కూడా అంతే అరుదుగా ఉంటుంది. అలాంటి విజయవంతమైన చిత్రాల్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ రూపొందించిన ఖడ్గం ఒకటి.

అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్, ఒక్క క్షణం ఫస్ట్ లుక్

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్