`RRR` విడుదల తేదీపై రాజమౌళి తెలివిగా ప్రవర్తిస్తున్నాడా?
- IndiaGlitz, [Sunday,January 19 2020]
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న చిత్రం 'RRR'. 'బాహుబలి' వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. అలాగే తెలంగాణ విప్లవవీరుడు కొమురం భీమ్‌గా తారక్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఇద్దరు పోరాట యోధులకు సంబంధించిన కల్పితగాథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో సముద్రఖని సహా బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, అలిసన్ డూడ్, ఒలివియా మోరిస్ తదితరులు నటిస్తున్నారు.
ఈ ఏడాది జూలై 30న సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో సినిమా విడుదల తేదీ మారుతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎక్కడా డైరెక్ట్ స్టేట్‌మెంట్ ఇవ్వడం లేదు. అంతా రాజమౌళికే సంబంధం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌పై తెలివిగా వ్యవహరిస్తున్నాడట. తాను ఎక్కడా రిలీజ్ డేట్‌పై స్పందించకుండా.. ఇన్ డైరెక్ట్‌గా అనౌన్స్ చేస్తున్నాడు. బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సాయంతో తన సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయించాడు. సినిమా అక్టోబర్‌లో విడుదలకానుందని ట్వీట్ చేయించాడు. చెప్పకనే రిలీజ్ డేట్‌పై తన అభిప్రాయాన్ని చెప్పాడని సినీ వర్గాలు అంటున్నాయి.