ఎన్టీఆర్ ఊసే లేని తలైవి ?

  • IndiaGlitz, [Tuesday,February 25 2020]

కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం 'త‌లైవి'. దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని విష్ణు ఇందూరి, శైలేష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఈ ఏడాది జూన్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌నుకున్నారు. జ‌య‌ల‌లిత పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన సెకండ్ లుక్‌కి చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. కాగా.. హీరోయిన్‌గా కెరీర్‌లో పీక్స్‌ను చూసిన జ‌య‌ల‌లిత ముగ్గురు ముఖ్య‌మంత్రులతో ప‌నిచేసింది. వారే..ఎంజీ రామ‌చంద్ర‌న్‌, ఎన్టీఆర్‌, క‌రుణానిధి. త‌ర్వాఈ ఆమె కూడా నాటి రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రిగా మారారు.

ఇప్పుడు త‌లైవిలో జ‌య‌ల‌లిత సినీ కెరీర్‌తో పాటు రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని చూపించ‌బోతున్నారు.ఈ సినిమాలో ఎంజీ రామ‌చంద్ర‌న్‌గా అర‌వింద‌స్వామి.. క‌రుణానిధిగా ప్ర‌కాశ్ రాజ్ న‌టిస్తున్నారు. కాగా ఎన్టీఆర్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై క్లారిటీ లేదు. బాల‌కృష్ణ న‌టిస్తాడ‌ని.. కాదు తార‌క్ న‌టిస్తాడంటూ వార్త‌లు వినిపించాయి. కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు 'త‌లైవి' చిత్రంలో అస‌లు ఎన్టీఆర్ పాత్రే లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు అంటున్నాయి. ఇది ఓ ర‌కంగా ఎన్టీఆర్ అభిమానుల‌కు నిరాశ‌ను క‌లిగించే విష‌య‌మే అయినా అస‌లు విష‌యం మాత్రం ఇదేన‌ట‌.