త్రిష ఒకలా.. మెగాస్టార్ మరోలా.. అసలేం జరిగింది!?

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకపోయుంటే ఈ పాటికే సుమారు సగానికి పైగా సినిమా పూర్తయ్యేది. అయితే.. ఇంతవరకూ ఇంకా హీరోయిన్ ఎవరు..? సినిమాలో నటించే పాత్రధారులు ఎవరు..? అనే విషయాలు తెలియట్లేదు కానీ.. ఓ వైపు సినిమా నుంచి తప్పుకునే వాళ్లు తప్పుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే సీనియర్ నటి త్రిష తాను ఈ సినిమాలో చేయట్లేదని వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ఆమె ప్రకటించింది. అయితే తాను ఎందుకు తప్పుకుంటున్నానే విషయంపై క్లారిటీ కూడా ఇచ్చుకుంది. ఈ కామెంట్స్‌పై ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు కానీ.. తాజాగా స్వయంగా మెగాస్టార్ చిరంజీవే ఓ ఇంటర్వ్యూ వేదికగా రియాక్ట్ అయ్యారు.

మెగాస్టార్ ఇలా..

తన సినిమా నుంచి త్రిష తప్పుకుందని తెలిసి షాకైనట్లు చిరు చెప్పారు. అసలేం జరిగింది..? త్రిషతో ఏమైనా సమస్య ఉందా..? అని చిత్రబృందాన్ని అడిగానని.. అయితే అలాంటివేమీ లేవని చెప్పారన్నారు. కచ్చితంగా త్రిషనే నటిస్తుందని తన కుమార్తె సుస్మితా.. త్రిషకు సంబంధించి కాస్ట్ట్యూమ్స్ కూడా సిద్ధం చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమాకు సంతకం చేసినట్లు తెలిసిందని.. ఆ సినిమాకు ఎక్కువగా డేట్స్ ఎక్కువగా ఇచ్చినట్లు తెలిసిందన్నారు. ఆ సినిమా విషయంలోనే తప్పుకుందని అనుకున్నట్లు చిరు చెప్పారు. అంతేకానీ అంతకు మించి.. క్రియేటివిటీ విషయంలో అస్సలు తమ టీమ్‌తో త్రిషకు ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు చిరు.

త్రిష ఇలా..!

సినిమాలో చేయమని అడిగేటప్పుడు చెప్పిన కథకు.. షూటింగ్‌లో దిగిన తర్వాత చేసే చిత్రీకరణకు చాలా డిఫరెన్స్ ఉంటుందన్నట్లుగా త్రిష ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. అంటే కథ ఒకటి చెప్పి మరొకటి షూట్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని ఆమె వెల్లడించిందన్న మాట. ‘నేను చిరంజీవి సినిమాలో చేయట్లేదు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. నా ప్రియమైన అభిమానులారా త్వరలోనే మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను’ అని త్రిష ట్విట్టర్‌లో వెల్లడించింది. వాస్తవానికి.. త్రిష ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్’, ‘పరమపదం విలయాట్టు’, ‘రాంగీ’, ‘రామ్’, ‘గర్జనై’ ప్రాజెక్టులతో బిజిబిజీగా ఉంది. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయ్ కానీ.. లేకుంటే త్రిష అస్సలు ఖాళీగా ఉండేది కాదేమో.

ఎక్కడో తేడా కొడుతోందే!

క్రియేటివిటీ విషయంలో డిఫరెన్స్ వచ్చిందని త్రిష అప్పుడు చెప్పగా.. చిరు మాత్రం అబ్బే అలాంటివేమీ లేవని ఆమెకు డేట్స్ లేకపోవడం వల్లే తప్పుకుందని అనుకుంటున్నట్లు చెప్పారు. అసలు ఇద్దరి మాటల్లో పొంతనే లేదని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి చూస్తే ఎక్కడో తేడా కొడుతోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాలంటే మరోసారి త్రిష ట్విట్టరెక్కాల్సిందే. లేదా కొరటాల అయినా స్పందించాల్సి ఉంది. దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో ఏంటో..!

More News

తెలంగాణలో అందరూ మాస్క్‌లు వాడాల్సిందే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రజలు మాస్క్‌లు ధరించడాన్ని

సూపర్ మార్కెట్‌లోకి నో ఎంట్రీ.. రాచకొండ సీపీ వార్నింగ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని సూపర్ మార్కెట్ల యాజమాన్యాలు అతి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ అదనుగా

కరోనాపై పోరు: అగ్రరాజ్యం కంటే ఇండియా చాలా బెటర్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన ఎవరెప్పుడు పడుతున్నారో..? ఎంతమంది చనిపోతున్నారా లెక్కలు తెలియని పరిస్థితి.

చిరు ట్వీట్‌కు తెలంగాణ డీజీపీ ఇంట్రెస్టింగ్ రిప్లయ్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని నిర్మూలించడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఓ వైపు లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేస్తున్న పోలీసులపై ప్రముఖులు ప్రశంసల జల్లు

మద్యం డోర్ డెలివరీపై ఆర్జీవీ ట్వీట్.. కేటీఆర్ పంచ్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.