త్రిష ఒకలా.. మెగాస్టార్ మరోలా.. అసలేం జరిగింది!?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకపోయుంటే ఈ పాటికే సుమారు సగానికి పైగా సినిమా పూర్తయ్యేది. అయితే.. ఇంతవరకూ ఇంకా హీరోయిన్ ఎవరు..? సినిమాలో నటించే పాత్రధారులు ఎవరు..? అనే విషయాలు తెలియట్లేదు కానీ.. ఓ వైపు సినిమా నుంచి తప్పుకునే వాళ్లు తప్పుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే సీనియర్ నటి త్రిష తాను ఈ సినిమాలో చేయట్లేదని వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ఆమె ప్రకటించింది. అయితే తాను ఎందుకు తప్పుకుంటున్నానే విషయంపై క్లారిటీ కూడా ఇచ్చుకుంది. ఈ కామెంట్స్‌పై ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు కానీ.. తాజాగా స్వయంగా మెగాస్టార్ చిరంజీవే ఓ ఇంటర్వ్యూ వేదికగా రియాక్ట్ అయ్యారు.
మెగాస్టార్ ఇలా..
తన సినిమా నుంచి త్రిష తప్పుకుందని తెలిసి షాకైనట్లు చిరు చెప్పారు. అసలేం జరిగింది..? త్రిషతో ఏమైనా సమస్య ఉందా..? అని చిత్రబృందాన్ని అడిగానని.. అయితే అలాంటివేమీ లేవని చెప్పారన్నారు. కచ్చితంగా త్రిషనే నటిస్తుందని తన కుమార్తె సుస్మితా.. త్రిషకు సంబంధించి కాస్ట్ట్యూమ్స్ కూడా సిద్ధం చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమాకు సంతకం చేసినట్లు తెలిసిందని.. ఆ సినిమాకు ఎక్కువగా డేట్స్ ఎక్కువగా ఇచ్చినట్లు తెలిసిందన్నారు. ఆ సినిమా విషయంలోనే తప్పుకుందని అనుకున్నట్లు చిరు చెప్పారు. అంతేకానీ అంతకు మించి.. క్రియేటివిటీ విషయంలో అస్సలు తమ టీమ్‌తో త్రిషకు ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు చిరు.
త్రిష ఇలా..!
సినిమాలో చేయమని అడిగేటప్పుడు చెప్పిన కథకు.. షూటింగ్‌లో దిగిన తర్వాత చేసే చిత్రీకరణకు చాలా డిఫరెన్స్ ఉంటుందన్నట్లుగా త్రిష ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. అంటే కథ ఒకటి చెప్పి మరొకటి షూట్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని ఆమె వెల్లడించిందన్న మాట. ‘నేను చిరంజీవి సినిమాలో చేయట్లేదు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. నా ప్రియమైన అభిమానులారా త్వరలోనే మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను’ అని త్రిష ట్విట్టర్‌లో వెల్లడించింది. వాస్తవానికి.. త్రిష ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్’, ‘పరమపదం విలయాట్టు’, ‘రాంగీ’, ‘రామ్’, ‘గర్జనై’ ప్రాజెక్టులతో బిజిబిజీగా ఉంది. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయ్ కానీ.. లేకుంటే త్రిష అస్సలు ఖాళీగా ఉండేది కాదేమో.
ఎక్కడో తేడా కొడుతోందే!
క్రియేటివిటీ విషయంలో డిఫరెన్స్ వచ్చిందని త్రిష అప్పుడు చెప్పగా.. చిరు మాత్రం అబ్బే అలాంటివేమీ లేవని ఆమెకు డేట్స్ లేకపోవడం వల్లే తప్పుకుందని అనుకుంటున్నట్లు చెప్పారు. అసలు ఇద్దరి మాటల్లో పొంతనే లేదని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి చూస్తే ఎక్కడో తేడా కొడుతోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాలంటే మరోసారి త్రిష ట్విట్టరెక్కాల్సిందే. లేదా కొరటాల అయినా స్పందించాల్సి ఉంది. దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో ఏంటో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments