‘లూసిఫర్’ అప్డేట్.. ఆయన తప్పుకోలేదట
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కారణంగా ఇటీవలి కాలంలో కొద్ది రోజులుగా మూవీ అప్డేట్స్ ఏవీ లేకుండా పోయాయి. అయితే తాజాగా ఓ మూవీ అప్డేట్ మాత్రం వచ్చింది. అదీ కూడా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించింది. గత కొద్ది రోజులుగా ‘లూసిఫర్’ రీమేక్‌కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు నుంచి మోహన్‌రాజా తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ‘లూసిఫర్’ కోసం మరో దర్శకుడిని మెగాస్టార్ చిరంజీవి వెదుకుతున్నారంటూ ఓ వార్త తెగ వైరల్ అయింది.
Also Read: మరో క్రికెటర్‌కు సోనూసూద్ సాయం..
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మోహన్‌రాజానే ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించిన డైలాగ్ వెర్షన్ కూడా పూర్తయ్యిందట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ లేకుండా ఉంటే, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి ఉండేది. ఇది పూర్తి కాగానే మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ చిత్రీకరణను ప్రారంభించాలని మెగాస్టార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments