సోనాల్ కి ఇక ఆ ఛాన్స్ లేనట్టే
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల ఆరబోతకు ఏ మాత్రం అభ్యంతరం చెప్పని నటీమణుల్లో సోనాల్ చౌహాన్ ఒకరు. కథ డిమాండ్ చేయకపోయినా సరే బికినీల్లో దర్శనమివ్వగలదీ సుందరి. ఇదిలా ఉంటే.. తెలుగులో ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగానే కనిపించిన సోనాల్‌కి.. లేక లేక 'షేర్'లో సోలో హీరోయిన్ వేషం దక్కింది.
ఆ సినిమా హిట్ అయితే మరిన్ని సోలో వేషాలు దొరకతాయని ఆశతో ఉన్న ఆమెకు.. ఆ సినిమా రిజల్ట్ పూర్తిగా నిరాశలోకి తీసుకువెళ్లిందట. దీంతో సెకండ్ హీరోయిన్లకే తన కెరీర్ అంకితం కానుందని ఈ ముద్దుగుమ్మ వర్రీ అవుతోందని ఫిల్మ్‌నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. అన్నట్టు.. 'సైజ్ జీరో', 'డిక్టేటర్' సినిమాల్లోనూ సోనాల్ రెండో నాయికగానే దర్శనమివ్వనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments