డీజే బెనిఫిట్ షోస్ లేవు...
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథమ్'. దిల్‌రాజు తన బ్యానర్లో నిర్మిస్తున్న 25వ చిత్రమిది. జూన్ 23న అంటే రేపు సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది. బన్ని సినిమాలకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సాధారణంగా అభిమానుల కోసం బెనిఫిట్ షోస్‌ను వేస్తుంటారు.
కానీ 'డీజే దువ్వాడ జగన్నాథమ్' సినిమా బెనిఫిట్ షోస్ లేవు. అందుకు కారణం బన్నియేనని అంటున్నారు. నిర్మాత దిల్‌రాజుకి బెనిఫిట్ షోస్ వద్దని చెప్పాడట. దిల్‌రాజు కూడా బన్ని నిర్ణయానికే మొగ్గు చూపాడట. అయితే అందుకు రెండు కారణాలున్నాయని కొందరు అంటున్నారు. బన్నికి సినిమా నచ్చి ఉండకపోవచ్చునని అంటున్నారు. మరి కొంత మందైతే సినిమా ఏమాత్రం తేడా ఉన్నా, అది నెగటివ్ సెన్స్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళుతుందని అందుకనే బన్ని ముందు జాగ్రత్తగా బెనిఫిట్ షోస్ వద్దని అనుకుని ఉంటాడని అంటున్నారు. ఏదైతేనేం ఓ రకంగా బెనిఫిట్ షోస్ లేకపోవడం బన్ని అభిమానులకు నిరాశను కలిగించే విషయమే మరి..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com