సంక్రాంతి రేసులో అక్కినేని హీరోలు  లేరా..?

  • IndiaGlitz, [Friday,December 04 2020]

కోవిడ్ సినీ రంగంపై చాలా పెద్ద ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి భ‌యం లేకుండా షూటింగ్స్ స్టార్ట్ కావ‌డం లేదు. తగు జాగ్ర‌త్త‌ల‌తోనే అంద‌రూ షూటింగ్స్ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇక రిలీజ్‌ల విష‌యంలోనూ థియేట‌ర్స్‌కు 50 శాతం ఆక్యుపెన్సీతో ఓకే చెప్పారు. ఇప్పుడిప్పుడే నిర్మాత‌లు సినిమాల‌ను విడుద‌ల చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాదిలో సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌, క‌ప‌ట‌ధారి సినిమాలు విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే సంక్రాంతి బ‌రిలోకి ఎవ‌రు దిగుతార‌నే దానిపై ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే చైత‌న్య ‘ల‌వ్‌స్టోరి’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’‌, ర‌వితేజ ‘క్రాక్‌’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ చిత్రాలు రేసులో ఉన్నాయన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు అక్కినేని బ్ర‌ద‌ర్స్ (చైత‌న్య‌, అఖిల్‌) సంక్రాంతి రేసు నుండి త‌ప్పుకున్నార‌ట‌. అందుకు కారణం యాబై శాతం ఆక్యుపెన్సీతో సినిమాను విడుద‌ల చేయ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌బోద‌ని నిర్మాత‌లు భావించే సంక్రాంతికి కాకుండా స‌మ్మ‌ర్‌లో వ‌స్తే ఎలా ఉంటుందా? అని ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. మ‌రి ఈ వార్త‌ల‌పై మేక‌ర్స్ ఏదేని అదికారిక ప్ర‌క‌ట‌న చేస్తారేమో చూడాలి.