'ఇంకొక్కడు' తెలుగు హక్కులను దక్కించుకున్న
- IndiaGlitz, [Tuesday,July 26 2016]
చియాన్ విక్రమ్ హీరోగా నయనతార, నిత్యామీనన్ హీరోయిన్స్‌గా థమీన్స్ ఫిలింస్ బ్యానర్స్‌పై శిబు థమీన్స్ నిర్మాతగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇరుమురుగన్'. దీన్ని తెలుగులో 'ఇంకొక్కడు' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ హీరోగానే కాకుండా హిజ్రా పాత్రలో కూడా నటిస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాను శిబుథమీన్స్ నుండి తెలుగులో విడుదల చేయడానికి నీలం కృష్ణారెడ్డి, ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ హక్కులను పొందారు. ఆగస్టు 2నే సినిమా ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకలో రాంచరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని వార్తలు వినపడుతున్నాయి.