రవితేజ తో నివేదా
Send us your feedback to audioarticles@vaarta.com
జెంటిల్ మన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక నివేదా థామస్. ఆ తరువాత నిన్ను కోరి సినిమాలో చేసిన పల్లవి పాత్ర ఆమెకు మరింత గుర్తింపు తెచ్చింది. అంతేగాకుండా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ చిత్రంలో ఇద్దరు హీరోయిన్‌లలో ఒకరిగా నటించింది. ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నివేదాకి.. ఆ తరువాత వచ్చిన జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ విజయాన్ని ఇవ్వలేకపోయింది.
ఇదిలా ఉంటే.. నివేదాకి మరో పెద్ద సినిమాలో కథానాయికగా నటించే అవకాశం వచ్చిందని తెలిసింది. కాస్త వివరాల్లోకి వెళితే.. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అమర్ అక్బర్ ఆంటోని పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రవితేజ త్రిపాత్రాభినయం చేయనున్నారని సమాచారమ్. ముగ్గురు హీరోయిన్లకు స్థానమున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నివేదా ఎంపికైందట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com