నివేదా హీరోయిన్ కాద‌ట‌

  • IndiaGlitz, [Saturday,April 28 2018]

'జెంటిల్‌మన్', 'నిన్నుకోరి', 'జై లవకుశ' చిత్రాల‌తో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది కేర‌ళ‌ కుట్టి నివేదా థామస్. అయితే వరుస విజయాలతో పాటు.. వరుస అవకాశాలు వచ్చినా చదువు కోసం సినిమాల్లో నటించడానికి కొంత గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు చదువు పూర్తవడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది ఈ మలబారు సుందరి.

అందులో భాగంగా.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఓ సినిమాలో నటించడానికి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది నివేదా. ఈ సినిమాలో ఈమెతో పాటు 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండే కూడా నటించనుంది. కాగా.. ఈ చిత్రంలో నివేదా హీరోయిన్‌గా కాకుండా కథను మలుపు తిప్పే పాత్రలో నటిస్తోందని తెలిసింది.

కథలో.. నివేదా పాత్ర ఎంట‌రయిన త‌ర్వాతే సినిమా ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. మంచి గ్రిప్పింగ్‌తో సాగే ఈ కథలో నివేదా పాత్ర చాలా కీలకమని చెబుతున్నారు. ఇప్పటివ‌ర‌కు హీరో పాత్ర‌ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని లీడ్ రోల్స్‌ చేస్తూ వచ్చిన నివేదా.. ఈ సారి నందమూరి వారసుడి సినిమాలోనూ అదే త‌ర‌హా లీడ్ రోల్ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

More News

మ‌హేష్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్‌

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను'  బాక్సాఫీస్ వ‌ద్ద‌ విజయం వైపు పరుగులు తీస్తోంది.

గ్రామీణ నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే.

తొలిసారి సంక్రాంతి బరిలో బోయపాటి ఫిల్మ్

తెలుగులో యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన‌ దర్శకుల‌లో బోయపాటి శ్రీను ఒక‌రు. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై

య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ కొత్త డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..

మ‌హాన‌టుడు, దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా య‌న్‌.టి.ఆర్ పేరుతో ఓ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

మూడో గేర్ లో డ్రైవర్ రాముడు

శకలక శంకర్... తాను తెర మీద కనపడగానే థియేటర్ మొత్తం నవుళ్ళతో నిండిపోతుంది. ఇలా  నవ్వులతో మంచి నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు.