మళ్ళీ బిజీ అవుతున్న నివేదా
Send us your feedback to audioarticles@vaarta.com
రెండేళ్ళ క్రితం విడుదలైన జెంటిల్ మన్ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నివేదా థామస్. ఆ తరువాత నిన్ను కోరి, జై లవ కుశ చిత్రాలు చేసింది. ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో హ్యాట్రిక్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది.
అయితే ఆ తరువాత విడుదలైన జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ నిరాశపరిచింది. గత కొంత కాలంగా చదువుపై దృష్టి పెట్టిన నివేదా.. మళ్ళీ వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాలో షాలిని పాండేతో పాటు మరో హీరోయిన్గా నటిస్తున్న నివేదా.. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ చిత్రాల కథానాయకుడు శ్రీ విష్ణు హీరోగా నటించనున్న ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నారు.
ఈ రెండు సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించనుంది నివేదా. మొత్తానికి.. గ్యాప్ తీసుకున్నా మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతోంది నివేదా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments