నివేదా దృష్టి అటువైపే
Send us your feedback to audioarticles@vaarta.com
నాలుగే నాలుగు సినిమాలతో టాలీవుడ్లో తనదైన ముద్రని వేసిన కథానాయిక నివేదా థామస్. నేచురల్ స్టార్ నానితో 'జెంటిల్ మన్', 'నిన్నుకోరి' సినిమాలతో వరుస హిట్లను అందుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. మూడవ సినిమా 'జై లవకుశ'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆడి పాడింది. ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది నివేదా.
అయితే.. తాజాగా విడుదలైన 'జూలియట్ లవర్ అఫ్ ఇడియట్' సినిమా మాత్రం ఆశించినంత విజయం సాధించలేదు. ఇప్పటికే మూడు హిట్లు తన ఖాతాలో ఉండడం వలన ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయినప్పటికీ ఈ మలయాళీ భామ ప్రస్తుతం సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
చెన్నైలో ఉన్న ఎస్.ఆర్.ఎం.విశ్వవిద్యాలయంలో జరగబోయే బాచిలర్ డిగ్రీ (ఆర్కిటెక్చర్ ) ఫైనల్ ఇయర్ పరీక్షల కోసం సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చింది నివేదా. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకే తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ నివేదా వదులుకుంటోందని సమాచారమ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments