నివేదా.. ట్రాక్ మారుస్తోందా?
Send us your feedback to audioarticles@vaarta.com
'జెంటిల్‌మన్', 'నిన్నుకోరి' చిత్రాలతో తెలుగువారిని ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్. తొలి రెండు చిత్రాల్లోనూ పెర్‌ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రల్లోనే కనిపించిన నివేదా.. ఆ సినిమాల్లో పెద్దగా గ్లామర్ ప్రదర్శన చేయలేదు. అయితే తన తాజా చిత్రం 'జై లవకుశ'లో మాత్రం కాస్త గ్లామర్ టచ్ ఇస్తున్నట్లు కొత్తగా విడుదలైన ఓ స్టిల్ చెప్పకనే చెబుతోంది.
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో జై పాత్ర కి జోడీగా నివేదా కనిపించనుంది. పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలోనే నివేదా నటిస్తున్నప్పటికీ.. 'నీ కళ్లలోన' పాటలో మాత్రం తన ట్రాక్ మార్చి మోడ్రన్ డ్రెస్సుల్లో దర్శనమివ్వనుందని తెలుస్తోంది. తన బాణీ మార్చి గ్లామర్ రోల్స్‌కి బోణీ చేస్తున్న నివేదాకి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలియాలంటే ఈ నెల 21 వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com