“శాకిని- ఢాకిని” గా నివేదా రెజీనా… త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..!!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో తన ఫెర్ఫామెన్స్తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది నివేదా థామస్. తాజాగా ఈ అమ్మడు తనలోని మరో షేడ్‌ని బయటకు తీసుకొచ్చేందుకు ఓ కొరియన్ రిమేక్‌తో మన ముందుకు రాబోతోంది. అయితే ఈ అమ్మాయి ఒక్కతే కాదు.. జంటగా సీనియర్ హీరోయిన్ రెజీనాను కూడా వెంట తీసుకువస్తోంది.
వివరాల్లోకి వెళితే.. నివేదా థామస్, రెజీనా లీడ్ రోల్స్‌లో దర్శకుడు సుధీర్ వర్మ ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ చిత్రాన్ని రిమేక్ చేస్తున్నాడు. కొరియన్ మాతృకలో ఇద్దరు యువకులు లీడ్ రోల్స్ ప్లే చేశారు. అయితే తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఆ పాత్రలను అమ్మాయిలకు అన్వయించారు దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘శాకినీ- ఢాకినీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. నివేదా థామస్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ఈ విషయాన్ని అఫిషీయల్‌గా అనౌన్స్ చేశాడు.
పోలీస్ ఆఫీసర్ ట్రైనీలుగా ఉండే ఇద్దరు అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికర్స్ ముఠాలతో తలపడాల్సి వస్తుంది. ఈ గ్యాంగ్స్ నుండీ తమని తాము ఎలా రక్షించుకున్నారు? మిగిలిన వారిని ఎలా రక్షించారన్నదే ఈ చిత్ర కథ. పూర్తి యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను దగ్గుబాటి సురేశ్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నివేదా- రెజినా క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా ఉంటాయని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వున్న ‘‘శాకిని- డాకిని’’ ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments