నెపోటిజం వల్ల నాకెలాంటి సమస్యా ఎదురుకాలేదు: నివేదా థామస్
Send us your feedback to audioarticles@vaarta.com
సెలక్టివ్‌గా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ నటిగా ఒక్కో మెట్టు ఎదుగుతున్న హీరోయిన్స్ నివేదా థామస్. ఈ టాలెంటెడ్ హీరోయిన్ లేటెస్ట్‌గా నటించిన చిత్రం ‘వి’. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, ఆదితిరావు హైదరిలతో కలిసి నివేదా థామస్ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెబినార్‌లో మీడియాతో ఆమె సినిమా గురించిన సంగతులను తెలియజేశారు....
‘వి’ అంటే...
‘వి’ అంటే ఏంటని చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ‘వి’ అంటే విక్టరీ కూడా అనుకోవచ్చు. నిజానికి ఈ సినిమాతో మా ఎంటైర్ టీమ్ విక్టరీ కావాలని బలంగా కోరుకుంటోంది. ఆ సక్సెస్ దక్కుతుందనే అనుకుంటున్నాం. అయితే ‘వి’ వెనుకున్న సీక్రెట్ ఏంటి అనే విషయం తెలియాలంటే మాత్రం సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
మీ పాత్ర గురించి...
ఇందులో నేను అపూర్వ అనే క్రైమ్ నవలా రచయిత పాత్రలో కనిపిస్తాను. మోహన్ సార్! కథ చెప్పగానే బాగా కనెక్ట్ అయ్యాను. అపూర్వ పాత్ర ఎంత ఓబీడీయెంట్‌గా ఉంటుందో అంతే డేరింగ్, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది.
ఓటీటీలో ‘వి’ విడుదలపై..
‘వి’ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయాలనే కాన్సెప్ట్‌తోనే ఎంటైర్ యూనిట్ కష్టపడ్డారు. అయితే పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవడంతో సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి కుదరలేదు. అమెజాన్‌లో సెప్టెంబర్ 5న విడుదల చేస్తున్నాం. నిజానికి ‘వి’ సినిమాను తెరపై చూస్తే వచ్చే ఫీలింగే వేరు. అలాగే ఓ ఆర్టిస్ట్‌కు తన సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసుకోవాలనే ఉంటుంది. అది ఎన్ని సినిమాలైనా చేసుండొచ్చు. మేం కూడా ‘వి’ సినిమాను అలాగే చూడాలనుకున్నాం. అయితే పరిస్థితి మీరు చూస్తున్నారుగా. అలాగే ఓటీటీలో ఇంత మంది స్టార్స్‌తో వస్తున్న తొలి తెలుగు సినిమా అని అంటున్నారు. మరి ఓటీటీలో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా అందరిలో మొదలైంది. కచ్చితంగా మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుందని చెప్పగలను.
స్క్రిప్ట్స్ ఎంపిక...
నేను పలానా స్క్రిప్ట్స్‌లో వినాలి, వినకూడదు ఆలోచనైతే లేదు. దాదాపు నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్‌ను తప్పకుండా వింటాను. అయితే వినే సమయంలో నేను ఈ పాత్రకు ఎలా న్యాయం చేయగలుగుతానా? అనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. దాన్ని బట్టే స్క్రిప్ట్స్‌ను ఎంచుకుంటాను.
నాని పాత్ర గురించి...
టీజర్, ట్రైలర్‌ను బట్టి చూస్తే నాని పాత్రలో గ్రేషేడ్స్ కనపడుతుంది. అందరూ అతని పాత్రను విలన్ అని అనేలా మనకు డిజైన్ చేశారు. అయితే ఇప్పుడు తన పాత్ర గురించి నేను చెప్పకూడదు. రేపు సినిమా చూసి మీరే తెలుసుకోవాలి.
టీమ్ గురించి...
ఈ సినిమాలో నటించిన నాని, ఆదితి, సుధీర్ అందరితో మంచి అనుబంధం ఉంది. ప్రొఫెషనల్‌గానే కాదు.. వ్యక్తిగతంగానూ వారు నాకు మంచి స్నేహితులు. ఇక డైరెక్టర్ మోహనకృష్ణగారితో ఇది వరకే పనిచేశాను. ఆయన నటీనటుల ఎంపిక స్క్రిప్ట్‌ను బట్టే చేసుకుంటారు. కాబట్టి నన్ను ఈ సినిమాలో ఎంపిక చేసుకున్నారంటే ఆ పాత్రకు నేను న్యాయం చేస్తాననే ఆయన భావించి ఉంటారు. ప్రతి ఒక్కరూ వారి పాత్రలను గొప్పగా చేశారు. ఓ మంచి సినిమాలో భాగమయ్యానని నమ్మకంగా చెప్పగలను.
నానితో అనుబంధం..
నానితో మంచి అనుబంధం ఏర్పడింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ తనకు నాకు మంచి ఫ్రెండ్. నాకు ఏదైనా కథ నచ్చితే.. తనతో డిస్కస్ చేస్తుంటాను. అలాగే తన సినిమాల్లోని పాత్రలు గురించి నాతో డిస్కస్ చేస్తుంటాడు. నాని యాక్టర్‌గా ఓ పాత్రను ఒప్పుకున్నాడంటే దాన్ని తెరపై తీసుకు రావడానికి ఇంకా గొప్ప ప్రయత్నం చేస్తారు. తను చాలా విషయాల్లో నాకు ఇన్ స్పిరేషన్.
లాక్‌డౌన్ సమయంలో...
లాక్‌డౌన్ సమయంలో అనే కాదు.. రెగ్యులర్‌గా నేను కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటాను. పుస్తకం చదువుతుంటాను. ఏదైనా సాఫ్ట్ వేర్ గురించి తెలుసుకుంటూనే ఉంటాను. నేను చేస్తున్న, చేయాలనుకున్న సినిమాల స్క్రిప్ట్ డెవలప్‌మెంట్స్ గురించి డిస్కస్ చేస్తుంటాను. లాక్‌డౌన్ సమయంలో కుటుంబంతో గడపడాన్ని బాగా ఎంజాయ్ చేశాను.
ఆదితి గురించి...
ఆదితిరావు హైదరి స్వీటెస్ట పర్సన్.. గొప్ప నటి. తనైనా, నేనైనా, మరేవరైనా మా పాత్రకు న్యాయం చేయాలనే ప్రయత్నించాం. గొప్పగా నటించడానికి ప్రయత్నించాం. అలా చేశాం కాబట్టే సినిమా బాగా వచ్చింది.
స్టార్ డమ్ గురించి...
స్టార్ గురించి నేను అస్సలు ఆలోచించను. ఇప్పుడు నేనున్న ఈ స్థాయిని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఓ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు అని నేను భావిస్తాను.
ఓటీటీ అవకాశాలు..
ఈ గ్యాప్‌లో నేను మూడు తెలుగు స్క్రిప్ట్ విన్నాను. అవన్నీ డెవలప్‌మెంట్స్‌లో ఉన్నాయి. వాటి వివరాలను తెలియజేస్తాను. ఇప్పుడు చాలా మంది ఓటీటీల్లో నటిస్తున్నారు. నన్నుఓటీటీలో నటించమని ఎవరూ అడగలేదు. అవకాశం వస్తే ఆలోచిస్తాను.
దర్శకత్వం...
ప్రస్తుతానికి నేను నటిని మాత్రమే. నన్నెవరూ పిలిచి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వరు. నేను అవకాశం కోసం వెళ్లాల్సి ఉంటుంది. అయితే వెంటనే సినిమా డైరెక్షన్ చేసేయను.. షార్ట్ ఫిలింస్ చేస్తాను.. అలా క్రమంగా సినిమా డైరెక్ట్ చేస్తాను.
నిర్మాతలకు సపోర్టివ్‌నే..
సినిమా బడ్జెట్‌లు, ఫైనాన్స్ విషయాలు నాకు తెలియవు. వి సినిమా లాక్‌డౌన్ కంటే ముందుగానే పూర్తయ్యింది. ఈ సినిమా నిర్మాతలకు నటిగా మా టీమ్‌తో కలిసి సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులు అలాగే కొనసాగవు. త్వరగానే అంతా సెట్ అవుతాయి. రెమ్యునరేషన్ విషయంలో నేన నిర్మాతలకు సపోర్ట్‌విగానే ఉంటాను.
నెపోటిజం...
నెపోటిజం వల్ల నటిగా.. నేను ఎలాంటి ససమ్యలు ఫేస్ చేయలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments