అఖిల్ సరసన నివేదా
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ తాజా చిత్రంలో నాయికగా నివేదాను అనుకుంటున్నారా? ఇటీవల తెలుగులో ఆమె వరుస చిత్రాలను చూసి దర్శకనిర్మాతలు ఆమెనే ఫిక్స్ చేశారా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.
`మెంటల్ మదిలో` చిత్రంతో తెలుగువారికి దగ్గరైన భామ నివేదా పేతురాజ్. తెలుగు మూలాలున్న ఈ భామ ఎన్నారై. పుట్టిపెరిగిదంతా దుబాయ్‌లోనే. సినిమాల మీద ప్యాషన్‌తో ఇక్కడున్నారు. ఇటీవల ఆమె నటించిన `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా` విడుదలయ్యాయి. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ చిత్రంలోనూ ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా అఖిల్ సరసన నటించడానికి సంతకం చేసినట్టు వినికిడి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ నెల మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
చాన్నాళ్ల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం చేస్తున్న సినిమా ఇది. మరోవైపు అఖిల్‌కు కూడా తాడోపేడో తేల్చుకోవాల్సిన సినిమా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments