అఖిల్ స‌ర‌స‌న నివేదా

  • IndiaGlitz, [Sunday,July 07 2019]

అఖిల్ తాజా చిత్రంలో నాయిక‌గా నివేదాను అనుకుంటున్నారా? ఇటీవ‌ల తెలుగులో ఆమె వ‌రుస చిత్రాల‌ను చూసి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమెనే ఫిక్స్ చేశారా? అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు.

'మెంట‌ల్ మ‌దిలో' చిత్రంతో తెలుగువారికి ద‌గ్గ‌రైన భామ నివేదా పేతురాజ్‌. తెలుగు మూలాలున్న ఈ భామ ఎన్నారై. పుట్టిపెరిగిదంతా దుబాయ్‌లోనే. సినిమాల మీద ప్యాష‌న్‌తో ఇక్క‌డున్నారు. ఇటీవ‌ల ఆమె న‌టించిన 'చిత్ర‌ల‌హ‌రి', 'బ్రోచేవారెవ‌రురా' విడుద‌ల‌య్యాయి. త్రివిక్ర‌మ్ - అల్లు అర్జున్ చిత్రంలోనూ ఆమె కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

తాజాగా అఖిల్ స‌ర‌స‌న న‌టించ‌డానికి సంత‌కం చేసిన‌ట్టు వినికిడి. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్‌, బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ నెల మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

చాన్నాళ్ల త‌ర్వాత బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్న సినిమా ఇది. మ‌రోవైపు అఖిల్‌కు కూడా తాడోపేడో తేల్చుకోవాల్సిన సినిమా.