నటి నివేతా పేతురాజ్ ఇంటి వద్దనే లేజర్ - స్కిన్సీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంటి వద్దనే లేజర్ హెయిర్ తగ్గింపు కోసం స్కిన్సీ యొక్క తాజా ప్రచారం ద్వారా పార్లర్‌కు వెళ్లే ప్రతి అమ్మాయి కష్టాలను వెల్లడిస్తున్న టాలీవుడ్ నటి నివేతా పేతురాజ్ భారతదేశంలో సుప్రసిద్ధమైన స్కిన్ క్లీనిక్–ఎట్ హోమ్ బ్రాండ్ స్కిన్సీ . ఇది లేజర్ హెయిర్ రిడక్షన్, కొరియన్ ఆక్వా గ్లో సాంకేతికతతో డెర్మాఫేసియల్ తో పాటుగా ఇతర చర్మ సంబంధిత సేవలను అందిస్తుంది సిరీస్ బీ ఫండెండ్ అంపా ఆర్థోడాంటిస్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రెండు బ్రాండ్లు స్కిన్సీ మరియు టూత్సీలు ఇంటివద్దనే చర్మ,దంత పరిష్కారాలను అందిస్తాయి
హైదరాబాద్, 19ఫిబ్రవరి 2022 : భారతదేశంలో సుప్రసిద్ధమైన చర్మ సంబంధిత సాంకేతికత తోడుగా కలిగిన ‘స్కిన్ క్లీనిక్ ఎట్–హోమ్’ బ్రాండ్ స్కిన్సీ (skinnsi) నేడు తమ నూతన ప్రచారాన్ని ప్రారంభించింది. ఇంటి వద్దనే లేజర్ ద్వారా జుట్టు తగ్గించుకునే సంస్థ సేవలను గురించి తెలిపేందుకు టాలీవుడ్ స్టార్ నివేతా పేతురాజ్ పక్కింటి అమ్మాయి అవతార్‌లో కనిపించనున్నారు. ఈ ప్రచారాన్ని పలు సామాజిక మాధ్యమాలపై నివేతా పోస్ట్ చేశారు. ఈ ప్రచారాన్ని సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఓటీటీ వేదికలపై బ్రాండ్ చేస్తుంది.
ఈ ప్రచార చిత్రంలో దేశవ్యాప్తంగా అబ్బాయిలు, అమ్మాయిలు నటిస్తున్న తీరును నివేతా ప్రశంసిస్తుంది. ఎందుకంటే పార్లర్‌కు వెళ్లిన వీరంతా కూడా ఆ సమయంలో తీవ్రమైన నొప్పి ఎదుర్కొన్నప్పటికీ పార్లర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ముఖంపై చిరునవ్వు పులుముకుంటారు. ఈ ప్రచార చిత్రంలో ఆమె వీరిని టీవీ, సినీ నటులుగా పోలుస్తారు.
ఆమె ఈ చిత్రంలోనే ‘అత్యుత్తమమైన మరియు దాదాపుగా శాశ్వతమైన పరిష్కారాన్ని స్కిన్సీ ఎట్ హోమ్ లేజర్ హెయిర్ రిడక్షన్’ గురించి తెలుపుతారు. డెర్మటాలజిస్ట్ తోడుగా ఉన్న ఐస్ రూల్4 వేవ్ లెంగ్త్ టెక్నాలజీ కేవలం 6–10 సెషన్‌లలో 90% హెయిర్ రిడక్షన్‌కు ఏ విధంగా తోడ్పడుతుందో వెల్లడిస్తారు. ఈ సేవలను స్కిన్సీ నిపుణులు సౌకర్యవంతంగా మీ ఇంటి వద్దనే చేస్తారు.
స్కిన్సీ(అండ్ టూత్సీ) హెడ్ ఆఫ్ మార్కెటింగ్ సుచితా వాధ్వా మాట్లాడుతూ ‘‘ఈ ప్రచారం ద్వారా గతానికన్నా మిన్నగా స్కిన్సీ పాత్రను వెల్లడిస్తున్నాం. వ్యాక్సింగ్ , షేవింగ్ మరియు పలుమార్లు పార్లర్‌ను సందర్శించడం సమయంతో కూడినది, నొప్పినీ కలిగిస్తుంది. మనం కోరుకునే విధానం కూడా కానిది ఇది. ఇప్పుడు స్కిన్సీ యొక్క డెర్మటాలజిస్ట్‌లు వెన్నంటి ఉండే ఎట్ హోమ్ లేజర్ హెయిర్ రిడక్షన్ తో శరీరంపై ఎక్కడైనా సరే అవాంఛిత రోమాలను తొలగించడం వీలవుతుంది. నివేతా పేతురాజ్‌తో భాగస్వామ్యంతో ఆమె దేశవ్యాప్తంగా తమ అభిమానులకు ఈ సేవలను గురించి వెల్లడిప్తారు. ఇప్పుడు మేము ఎట్ హోమ్ కొరియన్ ఆక్వా గ్లో ఫేసియల్ టెక్నాలజీతో డెర్మాఫేసియల్ మరియు మరెన్నో సేవలను మా స్కిన్ క్లీనిక్ ఎట్ హోమ్ కింద పరిచయం చేశాం. త్వరలోనే దీనిని ఆవిష్కరించనున్నాం. ఇంటివద్దనే నాణ్యమైన డెర్మటాలజిస్ట్‌ల సేవలను అందించాలనే మా ప్రయత్నాలకు ఇది ఆరంభం. ప్రస్తుతం మా సేవలను ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, చండీఘడ్, పూనె, కోల్‌కతా, చెన్నైలలో అందిస్తున్నాం’’ అని అన్నారు.
నివేతా పేతురాజ్ , ఓ భారతీయ నటి. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. ఆమె తన తొలి చిత్రం ఒరు నాల్ కూతు ను 2016లో చేశారు. ఆమె విజయవంతమైన చిత్రాలలో పొదువగ ఎన్ మనసు తంగం (2017), మెంటల్ మదిలో (2017), టిక్ టిక్ టిక్ (2018), చిత్రలహరి (2019), బ్రోచేవారెవరురా (2019) మరియు అల వైకుంఠపురం (2020) ఉన్నాయి. దాదాపు 25కుపైగా చిత్రాలలో ఆమె నటించారు.
ఈ భాగస్వామ్యం గురించి నివేతా పేతురాజ్ మాట్లాడుతూ ‘‘అమ్మయిల కష్టాలలో నన్ను నేను చూసుకుంటాను. ఎందుకంటే ప్రతి సారీ పార్లర్‌లో వ్యాక్సింగ్ చేయించుకోవడం విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. ఈ వేదన భరించలేనిది ! అందువల్ల వీరు నన్ను ఈ భాగస్వామ్యం కోసం సంప్రదించగానే మేము ఈ ప్రచార ఆలోచన గురించి చర్చించాము. మరీ ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా అబ్బాయి, అమ్మాయిల ఆందోళనలకు సంబంధించి నేను గొంతునవుతున్నప్పుడు అదెలా ఉండాలనేది చర్చించాము. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి వినోదాత్మకంగా ఉంది. నా అభిమానుల కోసం ఈ విప్లవాత్మక సేవలను పరిచయం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ను సంప్రదించాలనుకుంటున్నాను. ఎట్ హోమ్ లేజర్ హెయిర్ రిడక్షన్ కోసం నేడే ట్రయల్ సెషన్ బుక్ చేయండి !’’అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments