బంధువులు ఆ కారు కొన్నారని.. రేసింగ్ పై హీరోయిన్ పిచ్చి..
Send us your feedback to audioarticles@vaarta.com
హాట్ బ్యూటీ నివేద పేతురాజ్ కు రియల్ లైఫ్ లో ఓ సరదా ఉంది. సరదా కంటే పిచ్చి అంటే బెటర్ ఏమో. నివేదా పేతురాజ్ ఫార్ములా వన్ రేసింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే అందులో ఆమె చాలా ప్రావీణ్యం సంపాదించారు. తాజాగా నివేదా తన ఫార్ములా వన్ రేసింగ్ బ్యాగ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నివేదా మాట్లాడుతూ.. స్కూల్ డేస్ నుంచే నాకు ఫార్ములా రేసింగ్ అంటే మక్కువ ఏర్పడింది. ఫార్ములా వన్ రేసింగ్ లో శిక్షణ కూడా పొందాను. లెవల్ 1 రేసర్ గా సర్టిఫికెట్ కూడా పొందాను. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు మా బంధువులు ఒకరు స్పోర్ట్స్ కారు కొన్నారు. దీనితో నాకు కూడా స్పోర్ట్స్ కార్లపై ఇష్టం ఏర్పడింది. 2015లో నేను కూడా స్పోర్ట్స్ కారు కొన్నాను.
యూఏఈలో డాడ్జ్ ఛాలెంజ్ కారు కొన్న రెండవ మహిళని నేనే. కోయంబత్తూర్ లో అడ్వాన్స్డ్ రేసింగ్ లో లెవల్ వన్ పూర్తి చేశాను. ఇండియాలో ఫార్ములా వన్, ఫార్ములా 2 ఛాంపియన్ షిప్ లలో మహిళలకు పోటీలు లేవు . ఒకవేళ నిర్వహిస్తే ప్రోత్సాహంగా ఉంటుందనేది నా ఫీలింగ్.
రేసింగ్ లో పాల్గొన్న ప్రతిసారి రూ.15 లక్షలు ఖర్చవుతుంది అని నివేదా పేతురాజ్ తెలిపింది. ఈ సందర్భంగా నివేదా ఫార్ములా వన్ లో శిక్షణ పొందుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రేసింగ్ డ్రెస్ లో, కారుపై నివేదా సూపర్ స్టైలిష్ గా ఉంది. సాధారణంగానే గ్లామర్ తో వెలిగిపోయే నివేదా రేసింగ్ డ్రెస్ లో ఆకట్టుకుంటోంది.
నివేదా తెలుగులో చిత్రలహరి, అల వైకుంఠపురములో లాంటి చిత్రాల్లో నటించింది. నివేదా తమిళ, తెలుగు భాషల్లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments