బంధువులు ఆ కారు కొన్నారని.. రేసింగ్ పై హీరోయిన్ పిచ్చి.. 

  • IndiaGlitz, [Wednesday,July 14 2021]

హాట్ బ్యూటీ నివేద పేతురాజ్ కు రియల్ లైఫ్ లో ఓ సరదా ఉంది. సరదా కంటే పిచ్చి అంటే బెటర్ ఏమో. నివేదా పేతురాజ్ ఫార్ములా వన్ రేసింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే అందులో ఆమె చాలా ప్రావీణ్యం సంపాదించారు. తాజాగా నివేదా తన ఫార్ములా వన్ రేసింగ్ బ్యాగ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నివేదా మాట్లాడుతూ.. స్కూల్ డేస్ నుంచే నాకు ఫార్ములా రేసింగ్ అంటే మక్కువ ఏర్పడింది. ఫార్ములా వన్ రేసింగ్ లో శిక్షణ కూడా పొందాను. లెవల్ 1 రేసర్ గా సర్టిఫికెట్ కూడా పొందాను. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు మా బంధువులు ఒకరు స్పోర్ట్స్ కారు కొన్నారు. దీనితో నాకు కూడా స్పోర్ట్స్ కార్లపై ఇష్టం ఏర్పడింది. 2015లో నేను కూడా స్పోర్ట్స్ కారు కొన్నాను.

యూఏఈలో డాడ్జ్ ఛాలెంజ్ కారు కొన్న రెండవ మహిళని నేనే. కోయంబత్తూర్ లో అడ్వాన్స్డ్ రేసింగ్ లో లెవల్ వన్ పూర్తి చేశాను. ఇండియాలో ఫార్ములా వన్, ఫార్ములా 2 ఛాంపియన్ షిప్ లలో మహిళలకు పోటీలు లేవు . ఒకవేళ నిర్వహిస్తే ప్రోత్సాహంగా ఉంటుందనేది నా ఫీలింగ్.

రేసింగ్ లో పాల్గొన్న ప్రతిసారి రూ.15 లక్షలు ఖర్చవుతుంది అని నివేదా పేతురాజ్ తెలిపింది. ఈ సందర్భంగా నివేదా ఫార్ములా వన్ లో శిక్షణ పొందుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రేసింగ్ డ్రెస్ లో, కారుపై నివేదా సూపర్ స్టైలిష్ గా ఉంది. సాధారణంగానే గ్లామర్ తో వెలిగిపోయే నివేదా రేసింగ్ డ్రెస్ లో ఆకట్టుకుంటోంది.

నివేదా తెలుగులో చిత్రలహరి, అల వైకుంఠపురములో లాంటి చిత్రాల్లో నటించింది. నివేదా తమిళ, తెలుగు భాషల్లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.

More News

కార్తికేయ సరసన హాట్ బ్యూటీ.. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో మూవీ

మీడియం బడ్జెట్ లో ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేస్తోంది టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్. ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరో కార్తికేయ యువతకు బాగా చేరువయ్యాడు.

హీరో విజయ్ కి షాక్.. చివాట్లు పెట్టిన హైకోర్టు, సినిమాల్లో కరెప్షన్ కి వ్యతిరేకం

ఇలయథలపతి విజయ్ కి మద్రాస్ హైకోర్టులో షాక్ తగిలింది. ఊహించని విధంగా ఈ అగ్ర హీరో కోర్టు నుంచి చివాట్లు ఎదుర్కొన్నాడు. అంతేకాదు మద్రాసు హైకోర్టు రూ లక్ష జరిమానా కూడా విధించింది.

కంఫర్మ్: సౌరవ్ గంగూలీ బయోపిక్ కి అంతా రెడీ.. హీరో ఎవరో తెలుసా!

ఇండియన్ క్రికెట్ కి కొత్త ఊపు తీసుకువచ్చిన క్రికెటర్ సౌవర్ గంగూలీ. మూసగా సాగుతున్న ఇండియన్ క్రికెట్ ని తన అగ్రెసివ్ నిర్ణయాలతో పరుగులు పెట్టించాడు. యువతకు పెద్ద పీఠవేసి కొత్త

క్రేజీ విలన్ ఇల్లు సీజ్ చేసిన అధికారులు.. వణుకు పుట్టించే రీజన్!

కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వేవ్ తర్వాత మరో వేవ్ ఇలా ప్రజలపై కరోనా దాడి కొనసాగుతూనే ఉంది.

కత్తి మహేష్ మృతిపై డౌట్స్ ఇవే.. విచారణకు డిమాండ్

గత నెల జూన్ 26న ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కారు ప్రమాదానికి గురికావడం, చికిత్స పొందుతూ ఇటీవల మరణించడం తెలిసిందే. కత్తి మహేష్ చిత్తూరులోని తన స్వగ్రామానికి వెళుతుండగా