తన నిర్మాతకు జోడీగా నివేదా?
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా కె.వి.గుహన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గతంలో ‘అతడు’, ‘జల్సా’, ‘దూకుడు’ లాంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు.. పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన గుహన్.. ఈ చిత్రంతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇంతకుముందు ఆయన 'హ్యాపీడేస్' సినిమాను 'ఇనిదు ఇనిదు' పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. తెలుగులో మాత్రం దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇద్దరు కథానాయికలకు స్థానముంది. అందులో ఒక హీరోయిన్‌గా ‘జెంటిల్‌మన్’, ‘నిన్నుకోరి’, ‘జై లవకుశ’ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన నివేదా థామస్ ఎంపికకాగా.. రెండో కథానాయిక పాత్ర కోసం ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే పేరును పరిశీలిస్తున్నారు. ఇదివరకు కల్యాణ్ రామ్ నిర్మాణంలో ‘జై లవకుశ’ చేసిన నివేదాకు .. ఈ సారి తన నిర్మాతకు జోడీగా నటించే ఛాన్స్ దొరికిందన్నమాట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఏడాది ఆఖరులో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా.. కల్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన ‘నా నువ్వే’ మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments