నో కిస్ పాలసీపై నివేదా పేతురాజ్ రియాక్షన్ ఇదీ...
Send us your feedback to audioarticles@vaarta.com
‘బ్రోచేవారెవరురా’, ‘చిత్రలహరి’, ‘అల వైకుంఠపురంలో..’ లాంటి చిత్రాల్లో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్. ప్రస్తుతం ఈ అందాల భామ విశ్వక్ సేన్‌తో ‘పాగల్’ సినిమాలో నటిస్తోంది. అందం, అభినయంతో పాటు విభిన్న నటనతో కుర్రకారుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మొదట్నుంచి.. బోల్డ్ సీన్స్, కిస్ సీన్స్‌లో నటించట్లేదు. వాస్తవానికి విశ్వక్‌సేన్ ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో హీరోయిన్‌తో కిస్ సీన్లు చాలానే ఉన్నాయి. కానీ.. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ‘పాగల్’లో మాత్రం నివేదా పేతురాజ్‌తో అలాంటివి ఏమీ లేవట. దీంతో అసలు ఎందుకు ఈ బ్యూటీ ఇలాంటి సీన్లలో నటించదు..? ఈ అమ్మడు ఏమైనా ‘నో కిస్ పాలసీ’ పెట్టిందా ఏంటి..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లు ఈ పాలసీ నిజమేనంటూ పుంకాలు పుంకాలుగా వార్తలు రాసేశాయి. దీంతో ఎట్టకేలకు ఈ వార్తలకు.. నెట్టింట్లో వస్తున్న పుకార్లకు ట్విట్టర్ వేదికగా నివేదా క్లారిటీ ఇచ్చుకుంది.
తప్పుడు వార్తలొద్దు..
‘ముందుగా సినిమాలో కిస్ సీన్లు ఉన్నట్లు దర్శకుడు నాకు చెప్పలేదు.. సినిమా స్టోరీ అందంగా ఉంది.. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి’ అని ట్విట్టర్ వేదికగా బ్యూటీ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఓ ప్రముఖ వెబ్‌సైట్ పబ్లిష్ చేసిన కథనాన్ని కూడా ఈ ట్వీట్‌కు జతచేస్తూ.. దానికి రిప్లయ్‌గా పై విధంగా నివేదా చెప్పుకొచ్చింది. అయితే ఈ ట్వీట్‌కు నెటిజన్లు మళ్లీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంటే డైరెక్టర్ అడగలేదు కాబట్టి కిస్ సీన్స్ ఒప్పుకోలేదు.. ఒకవేళ అడిగి ఉంటే చేసేదానివా? అంటూ చిత్ర విచిత్రాలుగా నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తానికి చూస్తే.. నో కిస్ పాలసీ.. కండిషన్స్ ఏమీ లేవ్.. ‘నేను లిప్ లాక్స్ కి రెడీ’ అని ఇండైరెక్టుగా ఇలా ఈ భామ హింట్ ఇస్తోందన్న మాట. కాగా.. ‘పాగల్’ సినిమాలో నివేత పేతురాజు, సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘పాగల్’ మే-01న థియేటర్లలోకి రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments