నో కిస్ పాల‌సీపై నివేదా పేతురాజ్ రియాక్షన్ ఇదీ...

  • IndiaGlitz, [Thursday,April 01 2021]

‘బ్రోచేవారెవ‌రురా’, ‘చిత్రల‌హ‌రి’, ‘అల వైకుంఠ‌పురంలో..’ లాంటి చిత్రాల్లో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్‌. ప్రస్తుతం ఈ అందాల భామ విశ్వక్ సేన్‌తో ‘పాగ‌ల్’ సినిమాలో న‌టిస్తోంది. అందం, అభినయంతో పాటు విభిన్న నటనతో కుర్రకారుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మొదట్నుంచి.. బోల్డ్ సీన్స్‌, కిస్ సీన్స్‌లో నటించట్లేదు. వాస్తవానికి విశ్వక్‌సేన్ ఇప్పటివ‌ర‌కూ న‌టించిన సినిమాల్లో హీరోయిన్‌తో కిస్ సీన్లు చాలానే ఉన్నాయి. కానీ.. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ‘పాగ‌ల్’లో మాత్రం నివేదా పేతురాజ్‌తో అలాంటివి ఏమీ లేవట. దీంతో అసలు ఎందుకు ఈ బ్యూటీ ఇలాంటి సీన్లలో నటించదు..? ఈ అమ్మడు ఏమైనా ‘నో కిస్ పాలసీ’ పెట్టిందా ఏంటి..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లు ఈ పాలసీ నిజమేనంటూ పుంకాలు పుంకాలుగా వార్తలు రాసేశాయి. దీంతో ఎట్టకేలకు ఈ వార్తలకు.. నెట్టింట్లో వస్తున్న పుకార్లకు ట్విట్టర్ వేదికగా నివేదా క్లారిటీ ఇచ్చుకుంది.

తప్పుడు వార్తలొద్దు..

‘ముందుగా సినిమాలో కిస్ సీన్లు ఉన్నట్లు దర్శకుడు నాకు చెప్పలేదు.. సినిమా స్టోరీ అందంగా ఉంది.. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి’ అని ట్విట్టర్ వేదికగా బ్యూటీ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఓ ప్రముఖ వెబ్‌సైట్ పబ్లిష్ చేసిన కథనాన్ని కూడా ఈ ట్వీట్‌కు జతచేస్తూ.. దానికి రిప్లయ్‌గా పై విధంగా నివేదా చెప్పుకొచ్చింది. అయితే ఈ ట్వీట్‌కు నెటిజన్లు మళ్లీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంటే డైరెక్టర్ అడగలేదు కాబట్టి కిస్ సీన్స్ ఒప్పుకోలేదు.. ఒకవేళ అడిగి ఉంటే చేసేదానివా? అంటూ చిత్ర విచిత్రాలుగా నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తానికి చూస్తే.. నో కిస్ పాలసీ.. కండిషన్స్ ఏమీ లేవ్.. ‘నేను లిప్ లాక్స్ కి రెడీ’ అని ఇండైరెక్టుగా ఇలా ఈ భామ హింట్ ఇస్తోందన్న మాట. కాగా.. ‘పాగల్’ సినిమాలో నివేత పేతురాజు, సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘పాగ‌ల్’ మే-01న థియేటర్లలోకి రానుంది.

More News

ఆ సీన్‌ చూసి పవన్ చప్పట్లు కొట్టారు.. ఎగిరి గంతులేశా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.

‘రాకెట్రీ’ ట్రైలర్ రివ్యూ.. మాధవన్‌ జీవించేశాడుగా..!

ఇస్రో లెజెండ్ నంబి నారాయణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో ఈయన ఒకరు.

ఏప్రిల్‌ 3న ‘జీ 5’లో ‘సీత ఆన్‌ ది రోడ్‌’ ప్రీమియర్‌

వీక్షకులకు వినోదం అందించడంలో ముందుండే ఓటీటీ వేదిక ‘జీ 5’. కరోనా కాలంలో డైరెక్ట్‌–టు–డిజిటల్‌ రిలీజ్‌లు, ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు, పలు చిత్రాలను విడుదల చేయడం ద్వారా తెలుగు ప్రజలకు వినోదం అందించింది.

యూట్యూబ్‌లో ఇకపై ఈ ఆప్షన్ కనిపించదు..

యూట్యూబ్.. నెటిజన్ల జీవితంలో భాగమైపోయింది. దీని ద్వారా నిత్యం లక్షల రూపాయల్లో పలువురు సంపాదించుకుంటున్నారు.

పసివాడిని పొట్టనబెట్టుకున్న వివాహేతర సంబంధం..

పాపం పుణ్యం ప్రపంచ పోకడ తెలియని పసివాడు. ఏడాదిన్నర వయసు.. తల్లి, మహా అయితే బొమ్మలే ప్రపంచం..