నానితో మరోసారి జత కట్టనుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నాని ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోస్ బిజీ హీరో అయ్యాడు. రీసెంట్గా మజ్నుతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దిల్‌రాజు బ్యానర్లో త్రినాథ్ దర్శకత్వంలో నేను లోకల్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాని ఓ కొత్త దర్శకుడుతో కలిసి పనిచేయబోతున్నాడు. శివశంకర్ అనే డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో హీరో నాని ఆ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాని సరసన నివేదా థామస్ నటించనుందట. నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రీసెంట్గా రిలీజై మంచి హిట్ అయిన జెంటిల్మన్ సినిమాలో నాని, నివేదా థామస్‌లు కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సక్సెస్ జంట మరోసారి నటించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments