కమల్ హాసన్ గారు తర్వాత నా అభిమాన హీరో అతనే - నివేథా థామస్
- IndiaGlitz, [Saturday,June 18 2016]
నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం జెంటిల్ మన్. ఈ చిత్రంలో నాని సరసన నివేథా థామస్, సురభి నటించారు. ఇటీవల రిలీజైన జెంటిల్ మన్ చిత్రం సక్సెస్ టాక్ సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మలయాళ,తమిళ చిత్రాల్లో నటించిన నివేథా థామస్ జెంటిల్ మన్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై...తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఈ సందర్భంగా జెంటిల్ మన్ హీరోయిన్ నివేథా థామస్ తో ఇంటర్ వ్యూ మీకోసం...
జెంటిల్ మన్ లో ఆఫర్ ఎలా వచ్చింది..?
ఈ మూవీ కో - డైరెక్టర్ సురేష్ గారు నేను నటించిన కొన్ని సినిమాలు చేసారు. అలాగే తమిళ్ లో నా ఇంటర్ వ్యూస్ చూసి ఈ క్యారెక్టర్ కి నేను సెట్ అవుతానని డైరెక్టర్ మోహనకృష్ణ గారికి చెప్పారట. మోహన్ గారు కథ చెప్పగానే నాకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాను. ఆ విధంగా ఈ మూవీలో ఆఫర్ వచ్చింది.
ఏక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారా..?
లేదండి..ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదు. కనీసం చిన్నప్పుడు నటిద్దాం అనుకున్నా నన్ను ఎవరూ పిలవలేదు.
ఈ కథ విన్నప్పుడు ఎలా ఫీలయ్యారు..?
కథ విన్నప్పుడు నా క్యారెక్టర్ బాగా నచ్చింది. అలాగే మోహనకృష్ణ గారు, నాని హ్యాండ్స్ లో సినిమా ఉంది. సో..సినిమా పై నాకు మొదటి నుంచి మంచి నమ్మకం ఉంది. ఈ మూవీకి వర్క్ చేసిన తర్వాత మోహనకృష్ణ గారు నాకు ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు.
నానితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?
నేను నానికి పెద్ద ఫ్యాన్. నాని నటించిన అన్ని సినిమాలు చూసాను. పిల్ల జమీందార్, భలే భలే మగాడివోయ్ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నేను బాగా నటించాను అంటే ఆ క్రెడిట్ అంతా నానిదే. ఒక హీరో తన తోటి ఆర్టిస్ట్ లను అప్రిషియేట్ చేయడానికి గట్స్ కావాలి.నాని తన తోటి ఆర్టిస్టులను ఎంకరేజ్ చేసే విధానం నాకు బాగా నచ్చింది. కమల్ హాసన్ గారు తర్వాత నేను అభిమానించే హీరో అంటే నానినే.
తెలుగు బాగానే మాట్లాడుతున్నారు కదా..డబ్బింగ్ చెప్పకపోవడానికి కారణం..?
నాకు ఫస్ట్ నుంచి తెలుగు అంటే ఇష్టం. సెట్ లో నాతో అందరూ ఇంగ్లీషు, హిందీలోనే మాట్లాడేవారు. అయితే...తెలుగు నేర్చుకోవాలని పట్టుదలతో నేర్చుకున్నాను. డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కాకపోతే ఆ టైమ్ లోనే నాకు ఎగ్జామ్స్ ఉండడంతో కుదరలేదు.
ఎగ్జామ్స్ అంటున్నారు..ఇంతకీ ఏం చదువుతున్నారు..?
ఆర్కిటెక్చర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను. చదువుతూ.. నటించాలనుకుంటున్నాను.
తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాల్లో నటించారు కదా..ఏ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు..?
తెలుగు, తమిళ్, మలయాళం..ఇలా భాష వేరైనా వర్క్ మాత్రం ఒక్కటే. అందుచేత వీటిని డిఫరెంట్ ఇండస్ట్రీస్ గా చూడలేను. ప్రస్తుతం తెలుగులో మంచి సినిమాలు వస్తున్నాయి. అందుచేత తెలుగులో మరెన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. అయితే ఏ ఇండస్ట్రీలో సెటిల్ అవుతాను అనేది ప్రస్తుతం చెప్పలేను.
కమల్ హాసన్ గారితో వర్క్ చేసారు కదా...ఎలా ఫీలయ్యారు..?
కమల్ హాసన్ గారితో కలిసి పాపనాశం చిత్రంలో నటించాను. కమల్ సార్ తో కలిసి వర్క్ చేసినందుకు గర్వంగా ఉంది. ఈ మూవీని కమల్ గారు చూడలేదు. త్వరలో చూస్తారు అనుకుంటున్నాను.
లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలనుకుంటున్నారా..?
కథ నచ్చితే చేస్తాను. ఏ సినిమా అయినా సరే కథ నచ్చాలి. అందులో నా క్యారెక్టర్ నచ్చాలి. నేను ఏ సినిమా చేయాలి అనేది నా నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అందుచేత సెక్సెస్ - ఫెయిల్యూర్స్ కి నాదే బాధ్యత.
సినిమాల్లో స్కిన్ షో గురించి మీరేమంటారు..?
నేను క్యారెక్టర్ కి సెట్ అవుతానా లేదా అనే దానిబట్టి సినిమాలు చేస్తాను. స్కిన్ షో వలన సినిమాలు ఆడతాయి అంటే నేను నమ్మను. నేను నటించిన సినిమాలను 20 సంవత్సరాల తర్వాత చూసుకున్నా...ఓ మంచి సినిమాలో నటించాం అని ఫీలవ్వాలి. అలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నాను.
ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏమిటి..?
ప్రేమ అంటే ఆడ, మగ మధ్య ఉండేదే ప్రేమ కాదు. ఫాదర్, డాటర్, బ్రదర్,సిస్టర్...ఇలా రకరకాల ప్రేమలు ఉంటాయి. ప్రేమ లేనిదే ఏమీ లేదు అని నా అభిప్రాయం.
తెలుగులో ఏ హీరోతో వర్క్ చేయాలనుకుంటున్నారు..?
నానితో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలనుకుంటున్నాను (నవ్వుతూ...)
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
మంచి అవకాశాలు వస్తాయని వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఏ సినిమా అంగీకరించలేదు.