నివేదా.. రూట్ మార్చుతోందా?
Send us your feedback to audioarticles@vaarta.com
జెంటిల్మాన్, నిన్ను కోరి, జై లవ కుశ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది కేరళకుట్టి నివేదా థామస్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ అనే సినిమాలో నటిస్తోంది. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు పద్ధతిగా ఉండే పాత్రల్లోనే దర్శనమిచ్చిన నివేదా.. మున్ముందు గ్లామర్ పాత్రల్లోనూ కనిపించేందుకు ప్లాన్ చేసుకుంటోందని టాలీవుడ్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
కేవలం నటనకే పరిమితమైతే.. స్టార్డమ్ ని అందుకోవడం కష్టమని నిత్యా మీనన్ లాంటి హీరోయిన్లు నిరూపించిన నేపథ్యంలో.. నివేదా ఇప్పట్నుంచే జాగ్రత్త పడుతోందట. గ్లామర్, యాక్టింగ్.. ఇలా రెండు అంశాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ.. దూసుకుపోవాలని నివేదా నిర్ణయించుకుందని.. ఆమె నుంచి రాబోయే తదుపరి చిత్రాల ద్వారా ఈ విషయం ప్రేక్షకులకూ అర్థమవుతుందని ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా.. గ్లామర్ ప్రియులకు నివేదా నిర్ణయం శుభ వార్తే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com