నిత్యా , సమంత..వీరిలో ఎవరు?
Send us your feedback to audioarticles@vaarta.com
'ఇష్క్', 'మనం' చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్.. ప్రస్తుతం సూర్య హీరోగా '24' పేరుతో ఓ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'ఇష్క్' కథానాయిక నిత్యా మీనన్, 'మనం' హీరోయిన్ సమంత నాయికలుగా నటిస్తున్నారు. విక్రమ్ కుమార్‌కి తన సినిమాల పరంగా ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. తన హీరోయిన్‌కి ప్రియ అనే పేరుని పెట్టడం. 'ఇష్క్'లో నిత్యా పేరు అదే. అలాగే 'మనం'లో రెండో సమంత పేరు కూడా అదే. అంతకుముందు '13బి' సినిమాలో నీతూ చంద్ర పేరు కూడా అదే. మరి.. '24'లో నిత్యా, సమంత.. ఇద్దరూ నటిస్తున్నారు. ఈ సారి ప్రియ అనే పేరుని ఎవరికి పెడతారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com