నిత్యా మీనన్ హీరోయిన్ కాదట
Send us your feedback to audioarticles@vaarta.com
పాత్ర నచ్చితే చాలు.. నిడివితో సంబంధం లేకుండా సినిమా చేసేస్తుంటుంది నిత్యా మీనన్. నిన్నటికి నిన్న 'సన్నాఫ్ సత్యమూర్తి'లో హీరోయిన్‌కి తక్కువ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఎక్కువ అన్నట్లుండే పాత్రలో మెప్పించిన నిత్యా.. మరో ప్రతిష్టాత్మక చిత్రంలో అలానే దర్శనమివ్వనుంది. ఆ చిత్రమే సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్న '24'.
'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో నిత్యా.. ఎక్స్‌టెండ్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్‌లో కనిపించనుందట. 'ఇష్క్' కోసం ఇదివరకే విక్రమ్‌తో పనిచేసి ఉండడం..'24'లో తన పాత్ర నచ్చడంతో నిత్యా ఈ సినిమా ఒప్పుకుందని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తమ్మీద.. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న '24'లో నిత్యాది హీరోయిన్ పాత్ర కాదన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments