నిత్యామీనన్ - రైటర్ అండ్ ఫైటర్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం `ప్రాణ` అనే మలయాళ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీకే ప్రకాస్ దర్శకుడు. ఈ సినిమాలో నిత్యామీనన్ రైటర్ అండ్ ఫైటర్ పాత్రలో కనపడతారట. అలాగని యాక్షన్ సన్నివేశాలు కావట. సమాజంలో అసహనం, అన్యాయాన్ని ప్రశ్నించే ఫైటర్ పాత్రలో నిత్యా మీనన్ కనపడనున్నారట. తెలుగు, తమిళంలో కూడా నిత్యామీనన్‌కు మంచి ఆదరణ ఉండటంతో నిర్మాతలు ఈ సినిమాను తెలుగు, తమిళంలో కూడా అనువాదం చేసి విడుదల చేయాలని అనుకుంటున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments