నిత్యామీనన్ అండ్ స్టార్ హీరోస్
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల ప్రదర్శన కంటే అభినయ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చే కథానాయికగా నిత్యా మీనన్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. నిన్న మొన్నటివరకు తన పాత్రకే ఇంపార్టెన్స్ ఇస్తూ.. పక్కన నటించే హీరోల గురించి అంతగా పట్టించుకోని నిత్యా.. ఇప్పుడిప్పుడే తన శైలిని మార్చుకుంటోందా? అవుననే అనిపిస్తోంది తాజాగా ఆమె శైలిని పరిశీలిస్తుంటే. 'సన్నాఫ్ సత్యమూర్తి' కోసం తన క్యారెక్టర్‌కు పెద్దగా ప్రయారిటీ లేకపోయినా అల్లు అర్జున్‌తో చిందులేసి అలరించిన ఈ కేరళకుట్టి.. తమిళంలో రూపొందుతున్న సూర్య '24' కోసం ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సమంత మరో హీరోయిన్. 'ఇష్క్', 'మనం' చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక కన్నడనాట స్టార్ హీరో అయిన సుదీప్ తమిళ, కన్నడ భాషల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం 'ముడింజా ఇవన్ పుడి' లోనూ నిత్యా నాయికగా నటిస్తోంది. దీనికి అగ్ర దర్శకుడు కె.ఎస్.రవికుమార్ డైరెక్టర్.
స్టార్ హీరోస్‌తోనూ తను నటించడానికి రెడీ అన్నట్లుగా సంకేతాలు పంపుతున్న నిత్యా.. గ్లామర్ ప్రదర్శనను కూడా కొంచెం కొంచెంగా పెంచేందుకు సిద్ధపడుతోందని తమిళ తంబీలు అభిప్రాయపడుతున్నారు. మొత్తమ్మీద నిత్యా బాణీ మారుతోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com